జయ ఆరోగ్య పరిస్థితిపై అసలు విషయం బయట పడింది!

Secret behind Jayalalitha health

12:28 PM ON 19th November, 2016 By Mirchi Vilas

Secret behind Jayalalitha health

సెప్టెంబర్ 22న అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఇప్పడు అసలు విషయం బయటకొచ్చింది. ఈమె ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు రావడం, తమిళనాడులో ఆమె అభిమానులు పెద్దఎత్తున పూజలు, ప్రార్ధనలు చేయడం, ఇక రకరకాల పుకార్లు రావడం, అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని దీపావళికి ఇంటికి వచ్చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు కూడా. దీపావళి ముగిసి, ఇన్ని రోజులు ఎందుకు డిశ్చార్జ్ చేయలేదనే అనుమానం పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ సందేహాలకు అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వివరణ ఇచ్చారు.

జయలలిత అనారోగ్యం నుంచి కోలుకున్నారని, ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకే ఐసీయూలో ఉంచడం జరిగిందని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎవరికీ సందేహాలక్కర్లేదని స్పష్టం చేశారు. ఆమె వెంటిలేటర్ తో పనిలేకుండా శ్వాస తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రజల ప్రార్థనలు, డాక్టర్ల కృషి ఆమెను ఆరోగ్యంగా ఉంచాయని ఆయన చెప్పారు. ఆమె ఎప్పుడు వెళ్లాలని కోరుకుంటే అప్పుడు డిశ్చార్జ్ చేస్తామని ప్రతాప్ సి రెడ్డి ప్రకటించారు.

English summary

Secret behind Jayalalitha health