'విచిత్ర సోదరులు' చిత్రంలో కమల్ మరుగుజ్జు పాత్ర వెనుక రహస్యం ఇదే!

Secret behind Kamal character in Vichitra Sodarulu movie

11:28 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Secret behind Kamal character in Vichitra Sodarulu movie

విభిన్న పాత్రలు వేయాలని చాలా కొద్దిమంది నటులు అనుకుంటారు. అందులో అగ్రగణ్యుడు కమల్ హాసన్. విచిత్ర సోదరులు సినిమా చూస్తే అందులో మరుగుజ్జు పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. ఇంతకీ కమల్ పాత్ర కోసం చిత్ర బృందం ఎంతో శ్రమపడిందంట. ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా గురించి తరచూ అందుకే ప్రస్తావిస్తారు. తాజాగా మరోసారి ప్రస్తావించారు. అదేమిటో విందాం..

1/4 Pages

కమల్ ను అలా చూపించడానికి 18 అంగుళాల పొడవైన ఓ షూ ప్రత్యేకంగా తయారు చేయించాం. జపాన్ అనే సెట్ బోయ్ ఆ షూను తయారు చేశాడు. కాళ్లను వెనక్కి మడిచి కట్టి, మోకాళ్లను ఆ షూలో దూర్చి బెల్ట్ సాయంతో వెనక్కి కట్టేశాం. షూ కలర్ లోనే కమల్ తొడిగే ప్యాంట్, నడిచే ఫ్లోర్ ఉండేలా చూసుకున్నాం.

English summary

Secret behind Kamal character in Vichitra Sodarulu movie