కృష్ణమ్మ ఎలా పుట్టిందో తెలుసా!

Secret behind Krishna river

02:55 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Secret behind Krishna river

ఆగష్టు 12 నుంచి 23 దాకా కృష్ణా నదికి పుష్కరాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మఎలా పుట్టిందో పురాణాల ప్రకారం తెల్సుకుందాం. రావి, ఉసిరి చెట్ల నుంచి కృష్ణవేణి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దీని వివరాల్లోకి వెళ్తే.. భూలోకవాసులను పాప విముక్తుల్ని చేయడానికి ఉపాయం చెప్పమని బ్రహ్మాది దేవతలు మహావిష్ణువును ప్రార్థించారట. ఆయన వారందరినీ పరమేశ్వరుడి వద్దకు తీసుకెళ్లి విషయాన్ని వివరించారు. అప్పుడు త్రినేత్రుడు వారికి తరుణోపాయం తెలిపాడు. పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో బ్రహ్మగిరి వేదగిరి శిఖరాల్లో నీవు(శ్రీ మహావిష్ణువు) అశ్వత్థ(రావిచెట్టు) వృక్షంగా, నేను(శివుడు) అమలక(పెద్ద ఉసిరిక)గా వెలుస్తామని అన్నాడట.

మన ఇద్దరి అంశలతో కృష్ణ-వేణి పేరిట నదులు ఆవిర్భంచి, ఆ తర్వాత ఒకటిగా కలిసి, తూర్పు దిశగా ప్రవహించి బంగాళఖాతంలో కలుస్తాయని తెలిపారు. కాలక్రమంలో బ్రహ్మగిరిలో మహావిష్ణువు రావిచెట్టుగా మారి ఆ వేళ్ల కింద నుంచి వస్తున్న నీరు కృష్ణ అయింది. ఈశ్వరుడు వేదగిరిలో ఉసిరిచెట్టుగా వేయగా, ఆ వేళ్ల కింద నుంచి వచ్చిన నీరు వేణిగా మారింది. అలా కృష్ణవేణి ఆవిర్భవించింది.

English summary

Secret behind Krishna river