మగవారు మొలతాడు ధరించడం వెనుక అసలు కారణం!

Secret behind male waist thread

12:12 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Secret behind male waist thread

బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు మొలతాడు కడతారు. మొదట్లో ఆడ మగా అనే తేడా లేకుండా అందరికీ మొలతాడు కడతారు. కొందరు వెండి మొలతాడు కూడా కడతారు. అయితే పెద్ద వాళ్లవుతున్న నేపథ్యంలో మొలతాడు మగవాళ్లకు పరిమితమవుతూ వస్తుంది. మొలతాడు కట్టిన మగాడు అనే సామెత కూడా ఉండనే వుంది. ఇక మన సాంప్రదాయంలో ప్రతీది సైన్స్ కు సంబంధం ముడిపడి ఉంటుంది. మనం దరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. చివరకు మొలతాడు ధరించడం వెనుక కూడా ఒక రహస్యం దాగుందని అంటున్నారు. అదేమిటి అంటే, మొలతాడు ధరించడం వెనుక హిందూ సాంప్రదాయంలో ఒక భాగం ఎందుకంటే ఇది హిందువులలో ప్రతి మగాడికి ఉంటుంది.

చిన్న పిల్లలకు మొలతాడు కడితే వారు ఎదుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయట. ప్రధానంగా మగ పిల్లల్లో పెరుగుదల సమయంలో పురుషాంగం ఎటువంటి అసమతుల్యానికి గురికాకుండా కచ్చితమైన పెరుగుదల ఉండేందుకు మొలతాడును కడతారట. మొలతాడు కట్టుకుంటే రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందట. మగవారికి హెర్నియా రాకుండా మొలతాడు కాపాడుతుందట. దీన్ని పలువురు సైంటిస్టులు కూడా నిరూపించారట. అదండీ అసలు సంగతి.

English summary

Secret behind male waist thread