దసరా పండుగలో శ్రీ సరస్వతీ దేవి ప్రస్తావన వెనుక రహస్యం తెలుసా?

Secret behind Saraswathi Devi prastavana

01:15 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Secret behind Saraswathi Devi prastavana

దేవీనవరాత్రి ఉత్సవాల ఏడవరోజు(సప్తమి) నాడు సరస్వతీపూజ జరుపుకుంటారు. రోజుకో అవతారంలో భాగంగా సరస్వతిని పూజిస్తారు. అక్షరాభ్యాసం నాడు సరస్వతి దేవి ఎదుట అక్షరాలు దిద్దిస్తారు. అక్షరాభ్యాసం అయ్యాకే స్కూల్ లో వేయడం రివాజు. అయితే దేవి నవరాత్రులలో అమ్మవారిని సరస్వతి దేవి అలంకారంతో పూజ చేయడం కూడా అనాదిగా వస్తోంది. దసరా ఉత్సవాల్లో ఏడవ రోజు జరుపుకునే సరస్వతీపూజ సందర్భంగా పున:స్మరించుకోవడంలోనే మనకు సరస్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయన్న దాంట్లో సందేహం లేదు. దీని గురించి తెలుసుకుందాం..

1/4 Pages

వాగ్రూపమైన శారదకు నమోవాకములు అర్పిద్దాం. ఎందుకంటే, సంగీత సాహిత్యాలకు అధిష్టాత్రి - సరస్వతి దేవి. తెలుగు కబ్బాల పందిళ్ళకు అందుకున్న వెన్నెల తీగ - సరస్వతీస్తుతి. భాషకు, సాహిత్యానికి, ప్రతిభకూ, వ్యుత్పత్తికీ ప్రతీక సరస్వతి. సరస్వతీదేవిని కేవలం పండుగల్లో, పర్వదినాల్లో మాత్రమే కాదు; తెలుగు కావ్యాల అవతారికల్లో ఇష్టదేవతాస్తుతుల సందర్భంగా సరస్వతీప్రార్థన చేయని కవి లేడు. వ్యంగ్యంగా కవితా మర్యాదలకీ శారదాస్తుతి మూలంగా తెలుపని కవులు లేకపోలేదు. శారదా వర్ణనం - తెలుగు కబ్బాల పందిళ్ళకు అందుకున్న వెన్నెల తీగ - అని ప్రముఖ కవి ఇరివెంటి కృష్ణమూర్తి అన్నారు అందుకే.

English summary

Secret behind Saraswathi Devi prastavana