'సర్దార్' విడుదల వెనుక అసలు రహస్యం

Secret behind Sardar Gabbar Singh audio release

02:00 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Secret behind Sardar Gabbar Singh audio release

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ విషయాన్ని పవన్‌ దగ్గరుండి చాలా శ్రద్దతో పర్యవేక్షిస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కోసం పవన్‌ అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా ఏప్రిల్‌ 8న రిలీజ్‌ చెయ్యడం వెనుక కారణం ఏంటో అని అందరూ ఆలోచిస్తున్నారు. ఏప్రిల్‌ 8న తెలుగు సంవత్సరాది మరియు పవన్‌ కుమారుడు అఖిరా నందన్ పుట్టినరోజు కూడా అదే రోజు అవ్వడంతో ఈ సినిమాను ఏప్రిల్‌ 8న రిలీజ్‌ చెయ్యడానికి నిర్ణయించాడట పవన్‌. పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' రిలీజ్‌ వెనుక కూడా ఓ లెక్క ఉందన్నమాట. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ మార్చ్‌ 12న జరగనుంది.

English summary

Secret behind Sardar Gabbar Singh audio release. Pawan Kalyan want to release Sardar Gabbar Singh movie on his Son Akira Nandan birthday on April 8th and that day was Ugadi.