తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడుందంటే...

Secret cave that found in Tirumala

12:44 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Secret cave that found in Tirumala

తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటే చాలామంది ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రాముఖ్యత గురించి ఎన్నో అద్భుతాలున్నాయి. ఎంతోమంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల ప్రస్థానాన్ని ఎందరో రాశారు.. ఇప్పటికీ రాస్తున్నారు... భవిష్యత్తులో కూడా రాస్తూనే వుంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత సులువైన పని కాదని మఠాధిపతులు, పీఠాధిపతులు ఎన్నో సంధర్భాల్లో చెబుతూ వస్తున్నారు.

1/10 Pages

అతి పురాతనమైన వైకుంఠ గుహ..

ఇంతకీ అసలు విషయం ఏమంటే, తిరుమలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ గుహలో దాక్కునే వారట. తిరుమలలో అతి పురాతనమైన ఆ వైకుంఠ గుహ గురించి తెలుసుకుందాం. అనంత పుణ్యప్రదమైన ఈ వేంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అందువల్లే ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా ప్రసిద్థి చెందిందని చెబుతారు. ఈ కొండ మహిమ అనంతం, అవ్యక్తం. దేవతలకు కూడా ఈ కొండ గొప్పతనంలో ఆవగింజంతయినా అర్థం కాదని అంటుంటారు.

English summary

Secret cave that found in Tirumala