‘రాజ్ తరుణ్ తో రహస్య పెళ్లి’పై లాస్య షాకింగ్ కామెంట్స్

Secret Marriage of Hero Raj Tarun and anchor Lasya

06:46 PM ON 13th February, 2017 By Mirchi Vilas

Secret Marriage of Hero Raj Tarun and anchor Lasya

అటు బాలీవుడ్ కావచ్చు , ఇటు టాలీవుడ్ కావచ్చు హీరో హీరోయిన్లపై గ్యాసిప్స్ రావడం షరా మామూలే. అయితే కొన్ని నిజం వార్తలు కూడా గ్యాసిప్ లా కనిపిస్తాయి. మరికొన్ని నమ్మశక్యంగా ఉండవ్. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్‌, యాంకర్ లాస్య సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని ఇటీవల వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్, లాస్య బావామరదళ్లని, ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో ఓ వార్త బలంగానే వైరల్ అయింది. అయితే ఈ పెళ్లి వార్తపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాస్య స్పందించింది.

‘‘అసలు ఇలాంటి రూమర్లు ఎందుకొస్తాయో అర్థం కావడం లేదు. నాపై సూసైడ్ రూమర్ వచ్చిందంటే ఓకే. దానికొక పర్టికులర్ రీజన్ ఉందేమో ... వచ్చింది.. పోయింది అనుకోవచ్చు. కానీ నా పెళ్లి గురించి ఎందుకు? అది కూడా రాజ్ తరుణ్‌తో... నేను రాజ్ తరుణ్‌తో వర్క్ చేయలేదు. ప్రతి ఒక్క హీరో ఆడియో ఫంక్షన్లు జరుగుతుంటాయ్. చాలామంది హీరోలున్నారు కదా... రాజ్ తరుణ్‌తోనే ఎందుకు లింక్ పెట్టారో అర్థం కాలేదు. ఒక ఆడియో ఫంక్షన్‌లో రాజ్ తరుణ్‌తో నేనొక సెల్ఫీ దిగా. ఆ ఫొటోలో రాజ్ తరుణ్, నేను, సింగర్ నోయల్ ముగ్గురం ఉన్నాం. ఆ ఫొటోలో నోయల్‌ను పక్కకు లేపేసి.. మా ఇద్దరిది ఫొటో పెట్టి రూమర్ లేవదీశారు. నేను ఏ హీరో ఆడియో ఫంక్షన్ చేసినా కూడా సెల్ఫీ తీసుకోలేదు. సో.. రాజ్ తరుణ్‌తో సెల్ఫీ తీసుకున్నాను. కాబట్టి అదే తప్పయిందనుకున్నా. నేను, రవి షో చేశాం కబట్టి.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది కాబట్టి, రాసుకోవడానికి స్కోప్ ఉంది. కాని రాజ్‌తరుణ్‌తో ఎందుకొచ్చిందో తెలీదు. మా ఇద్దరికీ అసలు పరిచయమే లేదు.’’ అని లాస్య వివరిస్తూ, రూమర్లపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది.

ఇది కూడా చూడండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

ఇది కూడా చూడండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

English summary

Some gossips on Tollywood hero Raj Tarun and anchor lasya secret marriage.