షాకింగ్ న్యూస్: అల్లు శిరీష్ సర్జరీలు చేయించుకున్నాడా?!

Secret news about Allu Sirish

01:14 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Secret news about Allu Sirish

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ 'గౌరవం' మరియు 'కొత్త జంట' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. అల్లు శిరీష్ తాజాగా నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రానికి ముందు అల్లు శిరీష్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఏం చేశాడు అనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇంత కాలం అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అయితే అసలు విషయం ఏమిటంటే అల్లు శిరీష్ సన్నిహితుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం అల్లు శిరీష్ ఈ గ్యాప్ లో అందంగా అవ్వడానికి పలు సర్జరీలు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కొత్త జంట సమయంలో ఉన్న మొహానికి ఇప్పుడు మొహానికి మరియు బాడీకి చాలా చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు కారణం సర్జరీలు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు శిరీష్ పలు సర్జరీలు విదేశాల్లో చేయించుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు పలు సర్జరీలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అదే మాదిరిగా అల్లు శిరీష్ కూడా అందంగా మారేందుకు సర్జరీలు చేయించుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మొదటి రెండు సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అల్లు శిరీష్ ఈ సినిమాతో అయినా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటాడో లేదో చూద్దాం.

English summary

Secret news about Allu Sirish