అమరావతి నిర్మాణాల్లో నేలకుంగింది

Secretariat building collapses in Amaravathi

11:04 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Secretariat building collapses in Amaravathi

ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణంపై విమర్శలు రకరకాలుగా వెల్లువెత్తుతుండగా, తాజాగా జరిగిన సంఘటన ఏపీ రాజధాని అమరావతిలో కలకలం రేగింది. ఉలిక్కి పడేలా చేసింది. వెలగపూడిలో శరవేగంగా జరుగుతోన్న బహుళ అంతస్తుల తాత్కాలిక సచివాలయ భవనంలో నేల దాదాపు మూడు అడుగుల మేర కుంగిపోయింది. దీంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతినగా, నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంత్రులకు, ముఖ్య కార్యదర్శులకు కేటాయిస్తున్న బ్లాకులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పనులు ఏ విధంగా కొనసాగించాలన్న విషయమై అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు, పనుల నాణ్యతాప్రమాణాలు హుళిక్కేనా అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ లోపం జరిగిందన్నదానిపై ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. మరోవైపు, ఎట్టి పరిస్థితుల్లోను 27లోగా పనులు పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నా పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ముందుముందు మరెన్ని తేడాలు వెలుగు చూడనున్నాయో అంటున్నారు.

English summary

Secretariat building collapses in Amaravathi