'ఆదిత్య 369' మూవీ వెనుక దాగిన రహస్యాలు

Secrets behind Aditya 369 movie

01:30 PM ON 18th July, 2016 By Mirchi Vilas

Secrets behind Aditya 369 movie

ఏదైనా ఓ ట్రెండ్ బలంగా నడుస్తున్న సమయంలో దానికి ఎదురీతగా చేసే ప్రయత్నం సఫలమైతే అది కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుంది. అందుకు ఉదాహరణ 'ఆదిత్య 369' మూవీ. అప్పట్లో మాస్ మసాలా యాక్షన్ సినిమాలు వరుస పెట్టి వస్తున్న సమయంలో, అందుకు భిన్నంగా 'టైమ్ మెషీన్' నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన 'ఆదిత్య 369' మూవీ సంచలనం సృష్టించింది. నందమూరి నటసింహం బాలయ్య హీరోగా, సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఓ ఆణిముత్యంలా నిలిచిపోయింది. నిజానికి బాలయ్య వందో సినిమా దీనికి సీక్వెల్ గా తీయాలని భావించారు కూడా.

'ఆదిత్య - 369' సినిమా విడుదలై జూలై 18కి సరిగ్గా పాతికేళ్లు పూర్తయింది. ఈనేపధ్యంలో ఈ మూవీ గురించి కొద్దిగా ప్రస్తావిస్తే.. 

1/8 Pages

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 18 జూలై 1991న చిత్రాన్ని విడుదల చేశాం. ఇందులో బాలకృష్ణ గారి నటన చూసి ఎన్టీఆర్ చాలా మురిసిపోయారు. విలన్స్ గా అమ్రిష్ పురి, టిన్ను ఆనంద్, తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్, హీరోయిన్ మోహిని నటన ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నిర్మాతగా నన్ను నిలబెట్టిన చిత్రమిది. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది అని చెప్పారు.

English summary

Secrets behind Aditya 369 movie