'కబాలి' వెనుక దాగిన రహస్యాలు

Secrets behind Kabali movie

11:30 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Secrets behind Kabali movie

చరిత్ర తిరగరాయడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నద్ధమయ్యాడా? ఇప్పటికే పలు సినిమాలతో తానేమిటో నిరూపించిన రజనీ ఇప్పుడు కబాలి రూపంలో కనువిందు చేయబోతున్నాడు. అసలు ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరికీ బాలీవుడ్ మాత్రమే తెలిసేది. కానీ కాలం మారింది. ప్రతి ఒక్కరికీ ఒకరోజు వస్తుందన్న నానుడికి అనుగుణంగా బాలీవుడ్ ఒక్కటే కాదు దమ్మున్న సినిమా ఏదైనా సరే, దుమ్ము రేపుతోంది. ఎన్నో చిత్రాలు ఇప్పుడు ఎల్లలు చెరిపేసి, సత్తా చాటాయి. తెలుగు, తమిళ సినిమాలు ఓవర్సీస్ లోనూ జెండా పాతేశాయి.

ఇక విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన రజనీ నటించిన తాజా మూవీ కబాలి కోసం జపాన్, చైనా, ఇలా చెప్పుకుంటే పోతే ఇప్పుడు ప్రపంచంలోని చిన్నచిన్న దీవుల ప్రాంతాల్లోనూ జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇంతగా ఫీవర్ సృష్టించిన కబాలీలో ఏముందో తెల్సుకుందాం.

1/11 Pages

1. రజనీ విశ్వరూపం:


రజనీ 164వ చిత్రంగా వస్తున్న కబాలిలో ఆయన రిటైర్డ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. గతచరిత్ర ఆయనను వెన్నాడుతుంటుంది. 80వ దశకం నుంచి నేటి వరకూ ఆనేక ఉత్కంఠ ఘటనల నేపథ్యంలో రజనీ పాత్రను తీర్చిదిద్దారు. సో... ఢిఫరెంట్ లుక్స్... డిఫరెంట్స్ షేడ్స్... ఆయన పాత్రలో ఖాయమన్న మాటే.

English summary

Secrets behind Kabali movie