తిరుమల గురించి అపోహలు... మనం తెలుసుకోవాల్సిన నిజాలు

Secrets behind Tirumala

12:53 PM ON 19th October, 2016 By Mirchi Vilas

Secrets behind Tirumala

తిరుమల శ్రీవారి గురించి కొన్ని అపోహలున్నాయి. వాటి గురించి రకరకాల ప్రచారాలున్నాయి. అయితే వీటిని నివృత్తి చేస్తూ, కొన్ని వాస్తవాలని వెల్లడిస్తూనే వున్నా, అపోహలు కొనసాగుతున్నాయి. అయితే మరోసారి వాటిగురించి ఇలా నివృత్తి చేసారు. తిరుమలలో స్వామి వారి విగ్రహానికి తలనీలాలు ఉంటాయనే వదంతి ఒకటుంది. అలాగే, స్వామి వారికి సమర్పించే పూలు, పాలు, నెయ్యి ఇతర అన్ని రకాలను తిరుమల ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం నుంచే వస్తాయని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటి గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఓ టెలివిజన్ ఛానల్ తో మాట్లాడుతూ సందేహాలను తీర్చే ప్రయత్నం చేశారు.

1/6 Pages

1. విగ్రహాలకు తలనీలాలుంటాయా?


స్వామి వారికి కేశములు ఉన్నాయన్నది కల్పితం. స్వామి వారికి వెంట్రుకలు లేవు. స్వామి వారి శరీరం మెత్తగా ఉందని, చెమట పడుతుందని, గోళ్లు పెరుగుతాయన్నవి అవాస్తవాలు. ఇలాంటివి ప్రాకృతమైన మానవ దేహ లక్షణాలను అప్రాకృతులైన స్వామివారికి ఆపాదించడం దోషం.

English summary

Secrets behind Tirumala