తొలి ఏకాదశి పండగలో దాగిన రహస్యాలు

Secrets behind Toli Ekadasi

12:53 PM ON 15th July, 2016 By Mirchi Vilas

Secrets behind Toli Ekadasi

మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి ముఖ్యమైనది. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వస్తోంది. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఆషాఢం మంచిది కాదని అంటున్నా, పండగలకు నాంది పలికే తొలి పండగ తొలి ఏకాదశి కావడం విశేషం.

ఈరోజు నుంచీ శ్రీ మహా విష్ణువు పాలకడలిలో నిద్రిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ప్రకృతిలో జరిగే మార్పులకు పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి, సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈరోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు చెబుతున్నాయి.

1/7 Pages

24 ఏకాదశులు....


అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాలకొక సారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించారు.

English summary

Secrets behind Toli Ekadasi