దొంగ బాబాలు పెరిగిపోవడానికి సీక్రెట్ ఇదే!

Secrets of donga swamijis

11:53 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Secrets of donga swamijis

మనుషుల్లో ఉండే సింటిమెంట్లు, మంచితనం ఇవన్నీ ఆసరా చేసుకుని, రకరకాల జిమ్మిక్కులు చేసేవాళ్లు పెరిగిపోతున్నారు. ఇక దొంగస్వాములు, బురిడీ బాబాలకి మనదేశంలో కొదవలేదు. దొంగ స్వాముల బండారాలు రోజూ బయటపడుతున్నా స్వాములకి డిమాండ్ తగ్గడం లేదు. రోజుకో కొత్తబాబా పుట్టుకొస్తున్నాడు. టీవీ ఛానల్స్ లో స్లాట్స్ కొనుక్కుని మరీ బాబాలు, స్వామీజీలు చెలరేగిపోతున్నారు. ఈ బాబాలు, స్వామీజీల సక్సెస్ సీక్రెట్ తెలుసుకునేముందు, అసలు బాబాలకి డిమాండ్ ఎందుకు వచ్చిందో చూద్దాం...

బాబాలు, స్వామీజీలకి డిమాండ్ ఎందుకు పెరిగింది అంటే..?

హిందూ సమాజంలో ఆలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక గ్రామ ప్రజలు తమకి ఏ కష్టం వచ్చినా ఆలయానికి వెళితే అక్కడ పూజారుల నుండి స్వాంతన లభించేది. ఏదో తమకి తోచిన పరిష్కారం చెప్పేవాళ్ళు. గుడిలో దేవుడు మాట్లాడకపోయినా, పూజారి ఆ లోటు తీర్చగలిగేవారు. క్రమేణా ఆలయాలు నిర్లక్ష్యానికి గురై, దేవుడి మాన్యాలు ఆక్రమణలకి గురై, పూజారులకే పూటగడవడం కష్టం అయింది. ఇది 1990లకి ముందు మాట. ఆర్ధిక సంస్కరణల కారణంగా దేశంలో సంపద పెరిగి, మధ్యతరగతి పెరిగి, వాళ్ల కోర్కెల చిట్టా పెరిగాక, పిలిస్తే పలికే దేవుడు అవసరం అయ్యాడు. ఆ అవసరాన్ని బాబాలు, స్వామీజీలు తీరుస్తున్నారు. అంతకు ముందు కూడా స్వామీజీలు బాబాలు ఉన్నారు కానీ, ఈ రేంజ్ లో పెరగడం గత 20 ఏళ్లలో వచ్చిన మార్పు. ఇప్పుడిప్పుడే ఆలయాలలో పరిస్థితి మెరుగుపడుతోంది కానీ, బాబాలు స్వామీజీలు బాగా అడ్వాన్స్ అయిపోయారు. మోసపోతున్నామని కూడా తెల్సి మోసపోతే ఏమనాలి?

ఇది కూడా చదవండి: 3 లక్షలు కోసం రోజంతా సెక్స్ చేస్తానని బెట్ కట్టాడు.. చివరికి ఏమైందో తెలుసా?

ఇది కూడా చదవండి: వాట్సాప్ లో అది క్లిక్ చేస్తే మీ పని అయిపోయినట్టే!

ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో కన్నడ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోస్ హల్ చల్!

English summary

Secrets of donga swamijis. Reason for why fake babas and swamijis was increasing is, in olden days priests was cleared common people doubts. But now a days priests was not doing their job because they are doing professional jobs.