వైట్ రైనోకు ఫుల్ సెక్యూరిటీ..

Security To Rhinos

06:41 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Security To Rhinos

సాధారణంగా జూల్లో జంతువులకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని మనందరికీ తెలుసు. ఇక్కడ వంద సంఖ్యలో ఉండే జంతువుల కోసం భద్రతను ఏర్పాటు చేస్తారు. కానీ, ఒకే ఒక్క జంతువు కోసం సాయుధులైన బాడీగార్డులను ఏర్పాటు చేయడం చూశారా.. చూడకపోతే మీరు కెన్యాకు వెళ్లాల్సిందే. అక్కడ ఒకే ఒక్క జంతువుకు పదుల సంఖ్యలో బాడీగార్డులు సెక్యూరిటీగా ఉంటారు. అదే అరుదైన నార్తర్న్ వైట్ రైనో(ఖడ్గమృగం). అది కూడా మగది. ప్రస్తుతం ప్రపంచంలో ఈ జాతికి చెందిన రైనో మూడు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ మగ రైనో ఒక్కటే. అందుకే దానికి సాయుధులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది కెన్యా ప్రభుత్వం. అంతేకాదు దానిపై ఈగ కూడా వాలకుండా, ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. అది ఎక్కడకు వెళ్తే అక్కడకు వాళ్లు కూడా దాని వెంటే ఆయుధాలు పట్టుకుని నడుస్తూ వెళ్తారు. రోజంతా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రపంచంలో అంతరించిపోవడానికి అత్యంత దగ్గరలో ఉన్న జంతుజాతికి చెందినవి ఈ నార్తర్న్ వైట్ రైనోస్. కెన్యాలో ఈ జాతికి చెందిన ఆడ రైనోలు రెండు ఉన్నాయి. ఎలాగైనా వీటితో మగ రైనోను సంపర్కం జరిపించి ఆ జాతిని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో వయస్సు మీద పడిన ఏకైక మగ రైనోకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా కూడా ఈ చర్యలు చేపట్టారు.

English summary

Rhinos are targeted by poachers, fueled by the belief in Asia that their horns cure various ailments. Experts say the rhino horn is becoming more lucrative than drugs. Due to this kenya government kepps them in tight security