సింగిల్ షాట్ లో శివాజీ సినిమా

Seesa Movie Shooted In Single Shot Says Shivaji

10:08 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Seesa Movie Shooted In Single Shot Says Shivaji

నిజమా అంటే నిజమని అంటోంది సినిమా బృందం. కేవలం ఒకే ఒక్క షాట్‌ లో సినిమా పూర్తయిందంటే ఆశ్చర్యమే మరి. ఎందుకంటే ఓ షాట్ తీయాలంటే ఎన్నో కట్ లు , టేక్ లు వుంటాయి. అలా ఎన్నో షాట్‌లు కలిపితే కానీ ఒక సినిమా పూర్తవదు. కానీ సినిమా మొత్తాన్ని ఒకే ఒక్క షాట్‌లో తీయడమంటే మిరాకిల్ అనవచ్చు ! ఇంతకీ అలా తీసిన సినిమా ‘సీసా’. శివాజి, నమ్రత, నిశాదేశ్‌ ప్రధాన పాత్రధారులుగా లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘సీసా’ ను సింగిల్ షాట్ లో తెరకెక్కించామని దర్శకుడు ఇషాక్‌ చెబుతున్నాడు. ఈ నెల 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివాజి మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఒకే షాట్‌లో పూర్తయ్యే సినిమా అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. మెరీనా బీచ్‌లో మాతో రిహార్సల్స్‌ చేయించి అక్కడే సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమా చూస్తే సాంకేతిక బృందం సత్తా ఏంటో తెలుస్తుంది. నాటకీయత, ఉత్కంఠ, భయాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అంటూ వివరించాడు. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ చెబుతున్నాడు. మరి సింగిల్ షాట్ సినిమా కు ప్రేక్షకాదరణ ఎలా వుంటుందో మరి.

English summary

Tollywood hero Shivaji's upcoming movie was Seesa. Shivaji said some intersting facts about the movie like this movie was shooted in single take and this movie producer was planning remake this movie in Bollywood Also.