'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' రిలీజ్ డేట్

Seethamma Andalu Ramayya Sitralu movie release date

05:34 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Seethamma Andalu Ramayya Sitralu movie release date

కుమారి 21ఎఫ్ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో రాజ్తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్తరుణ్ సరసన నూతన కధానాయిక అర్తన నటిస్తుంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్. శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రంలోని పాటలు విడుదలై ఇప్పటికే మంచి రెస్పాన్స్ రప్పించుకుంది. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 29న విడుదల కాబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా అందరినీ అలరిస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతుందని రాజ్ తరుణ్ అన్నాడు.

English summary

Seethamma Andalu Ramayya Sitralu movie releasing on January 29th. Raj Tarun and Arthana pairing in this film.