సెహ్వాగ్ రికార్డు సిక్స్..!

Sehwag completed his century with huge six

06:22 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Sehwag completed his century with huge six

అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన క్రికెటర్ లతో మాస్టర్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో జెమిని అరేబియన్స్ జట్టు తరపున బరిలోకి దిగిన ఇండియా డ్యాషింగ్ ఓపనర్ వీరేందర్ సెహ్వాగ్ ఒక భారీ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సగిటారియస్ స్ట్రైకర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ 63 బంతుల్లోనే 134 పరుగులు చేసి ఊచ కోత కోశాడు. అగ్నికి వాయువు తోడైనట్లు సెహ్వాగ్ కి సంగక్కర(51) కలవడంతో స్కోరు బోర్డు పరిగెట్టింది. సెహ్వాగ్ 134 పరుగుల్లో 11 సిక్స్ లు, 10 ఫోర్లు ఉండటం విశేషం. సెహ్వాగ్ దాటికి జెమిని జట్టు 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అయితే సగిటారియస్ కూడా గట్టిగానే పోరాడింది. 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి 12 పరుగులతో ఓటమి పాలైంది.

English summary

India dashing opener Virender Sehwag completed his century with huge six in Masters Cricket League. He beat 134 runs in 63 balls against Sagitarios Strikers.