400 మార్కును చేరుకోలేనందుకు చింతిస్తున్నా : సెహ్వాగ్‌

Sehwag Dissappointed For Not Scoring 400

05:45 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Sehwag Dissappointed For Not Scoring 400

భారత మాజీ క్రికెటర్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

రిటైరైన్‌ సెహ్వాగ్‌ ను భారత క్రికెట్‌బోర్డు సంఘం (బిసిసిఐ) వారు ఢిల్లీలో భారత-సౌత్‌ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా వీరూను సన్మానించింది . ఈ సందర్భంగా ఇంతకాలం తనను ఆదరించిన బిసిసిఐ కు, అభిమానులకు సెహ్వాగ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే తో మాట్లాడుతూ తాను ఇప్పటివరకు క్రికెట్‌ నుండి పొందిన వాటితో చాలా సంతోషంగా ఉన్నానని, అయితే తాను టెస్టులో 400ల వ్యక్తిగత స్కోర్‌ చెయ్యలేకపోవడం కాస్త బాధించిందని అన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌ తన మార్కు బ్యాటింగ్‌ తో ప్రపంచక్రికెట్‌ లో తనదైన ముద్ర వేశాడు. భారత డాషింగ్‌ ఓపెనర్‌ గాను ముద్రవేసుకున్నాడు. బౌలర్‌ ఎవరనేది పట్టించుకోకుండా బౌండరీలే లక్ష్యంగా బౌలర్ల పై విరుచుకు పడేవాడు. భారత క్రికెట్‌ తరపున రెండు ట్రిపుల్‌ సెంచురీలు చేసిన ఏకైక బ్యాట్సమేన్‌గా సెహ్వాగ్‌ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. వన్డే క్రికెట్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ చేసిన డబుల్‌ సెంచురీ తరువాత డబుల్‌ సెంచురీ చేసిన రెండో బ్యాట్‌మేన్‌గా సెహ్వాగ్‌ రికార్డు సృష్టించాడు. సెహ్వాగ్‌ రిటైర్‌మెంట్‌ భారత క్రికెట్‌కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.

English summary

India's dashing batsman Virender Sehwag retired from all forms of cricket recently.Bcci felicitated sehwag in delhi during india-south africe test match. Sehwag says that he is dissappointed for not scoring 400 in tests