చిటపట చినుకుల్లో పరవశించిన సెహ్వాగ్‌

Sehwag Enjoys By Walking In Rain

10:47 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Sehwag Enjoys By Walking In Rain

క్రికెటర్‌ దిగ్గజం సచిన్‌తో కలిసి మైదానంలో సిక్సర్ల వాన కురిపిస్తుంటే ప్రేక్షకులు అభిమానంతో తడిచి ముద్దయ్యే వారు. అతడు బ్యాటింగ్‌ చేస్తుంటే, ఎంత బలంగా బాదుతాడో అని. బంతి భయపడేదంట. అయితే వన్డేల్లో ద్విశతకం(219) చేసిన ఒకే ఒక్క కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో నిలిచాడు.

ఇవి కూడా చదవండి:రోహిత్ శర్మ విల్లా ఖరీదు ఎంతో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం తర్వాత వ్యాఖ్యాతగా అందరినీ సెహ్వాగ్‌ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌-9లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ మార్గనిర్దేశకుడిగా పనిచేస్తున్న ఈ వీరేంద్రుడు బెంగళూరులో వర్షంలో నడుస్తూ తన్మయత్వం చెందాడు. చిన్నస్వామి మైదానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కింగ్స్‌ జట్టు స్టేడియానికి వచ్చే ముందు చిటపట చినుకులు పడుతూ వుంటే సెహ్వాగ్‌ వర్షంలో నడుస్తూ పరవశం అయ్యాడు. చినుకుల్లో తడిస్తే, ఆ కిక్కే వేరబ్బా అంటూ సంతోషం తో ఉప్పొంగాడు.

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ చెప్పులు తొడిగింది ఎవరికంటే ..

ఇవి కూడా చదవండి:పవన్ గురించి బన్నీ అలా ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చేసాడు(వీడియో)

English summary

Indian Dashing Batsman Virender Sehwag Enjoys by walking in rain in Chinna swamy Stadium in Chennai. Presently he was appointed as a mentor to Kings IX Punjab Team in IPL.