ఆ 5 బ్యాంకుల్లో ఎంతైనా డిపాజిట్ వేయొచ్చన్న సెహ్వాగ్!

Sehwag shocking tweet about 500 and 1000 notes

12:51 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Sehwag shocking tweet about 500 and 1000 notes

అదిరిపోయే ఇన్నింగ్స్ లతో భారత క్రికెట్ అభిమానులను అలరించిన వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించాక తన పంచ్ ట్వీట్ లతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనదైన శైలిలో మరో పంచ్ ట్వీట్ తో ఆకట్టుకున్నాడు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకుల్లో డిసెంబర్ 31 వరకూ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత కూడా వచ్చే ఏడాది 31 వరకూ రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి డిక్లేరన్ ఫారం సమర్పించి మార్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో మార్చి 31 తర్వాత కూడా ఆ ఐదు బ్యాంకులు రూ.500, 1000 నోట్లు స్వీకరిస్తాయని అవి బ్యాంక్స్ ఆఫ్ గంగా, యమునా, సరస్వతీ, నర్మదా, గోదావరి అని సెహ్వాగ్ ఛలోక్తి విసిరాడు.

ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం చేసిన నేపథ్యంలో కొందరు పెద్ద మొత్తంలో తమ దగ్గర ఉన్న నగదును ఎలా చెల్లుబాటు చేసుకోవాలో తెలీక వాటిని గంగా నదిలో వేస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అందుకే సెహ్వాగ్ ఈ ట్వీట్ చేసాడు.

English summary

Sehwag shocking tweet about 500 and 1000 notes