కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ మెంటార్‌గా సెహ్వాగ్‌

Sehwag To Be Kings XI Punjab Mentor

10:37 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Sehwag To Be Kings XI Punjab Mentor

టీమిండియా మాజీ ఓపెనర్‌, డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఐపీఎల్‌-2016లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టీమ్ కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సెహ్వాగ్‌ ఆటతో మాత్రం అనుబంధాన్ని కొనసాగిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సెహ్వాగ్‌ ఈ ఏడాది నుంచి జట్టు ప్రధాన కోచ్‌ సంజయ్‌ భంగర్‌కు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఈ నియామకంపై భంగర్‌ స్పందిస్తూ సెహ్వాగ్‌ గత రెండు సీజన్లలో తన బ్యాటింగ్‌తో జట్టులో స్ఫూర్తి నింపాడని, తాజాగా అతని సూచనలు, సలహాలతో పంజాబ్‌ మరిన్ని విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రీతిజింతా సహ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

English summary

Dashing Opener Virender Sehwag was appointed as the mentor for Kings XI punjab team for IPL 201 and Sehwag will assist the IPL team's head coach Sanjay Bangar in the upcoming IPL season