నాతో డేటింగ్ కి ఎవరు వస్తారు?

Selena Gomez giving offer to date with her

05:20 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Selena Gomez giving offer to date with her

మాములుగా సెలబ్రిటీలు మరో సెలబ్రిటీతోనే డేటింగ్ చెయ్యాలనుకుంటారు.. కానీ ఈ పాప్ సింగర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తాను అంటుంది. ఇంతకీ సెలీనా ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. పాప్ సింగర్ గా సెలినా గొమేజ్ కి ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ ఉంది. అదీ కాకుండా తోటి పాప్ సింగర్ జస్టిన్ బైబర్ తో ఈ భామ ప్రేమాయణం సాగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరు విడిపోవడంతో సెలీనా మరొకరితో డేటింగ్ చేసే ప్రయత్నంలో ఉందట. అయితే తనకు ఇప్పుడు పాపులారిటీ లేని వారితో డేటింగ్ చేయాలని ఉందని.. అలాంటి వాళ్లు దొరకట్లేదని అంటోంది.

నాకంటే తక్కువ పాపులారిటీ ఉన్నవారితోనే డేటింగ్ చేద్దామనుకుంటున్నా. కానీ ఎవరూ దొరకట్లేదు. నాతో డేటింగ్ చేస్తే ఇబ్బంది అనుకుంటున్నారు కాబోలు. ఎందుకంటే ఎవరూ తమ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ లో ఉంచడానికి ఇష్టపడరు. నాతో డేటింగ్ చేస్తే పాపులారిటీ లేనివాళ్లు పబ్లిక్ లో పడతారని భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే తక్కువ పాపులారిటీ ఉన్న నటులు.. రచయితలు.. నిర్మాతలు నన్ను చూసి భయపడుతున్నారు అని ఆశ్చర్యకరంగా చెప్పింది ఈ సుందరి. మరి ఈమెతో డేటింగ్ చెయ్యడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి..

English summary

Selena Gomez giving offer to date with her