బాయ్ ఫ్రెండ్ కావాలని కలవరిస్తున్న హీరోయిన్

Selena Gomez needs a boyfriend

10:52 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Selena Gomez needs a boyfriend

ప్రముఖ గాయని, హీరోయిన్ సెలెనా గోమెజ్ కు ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని తెగ కలవరిస్తోందట. అంతేకాదు బాయ్ ఫ్రెండ్ ని చూసి పెట్టాలని కూడా ఒకరికి బాధ్యత అప్పగించింది అంటున్నారు. ఇందుకోసం ఇంతకుముందు తనతో కలిసి కార్ పూల్ కరావోకే షో హోస్ట్ అయిన జేమ్స్ కార్డెన్ కు ఈ బాధ్యత అప్పజెప్పింది. ఈనెల 20వ తేదీన వీళ్లిద్దరూ కలిసి కార్ పూల్ కారవోకే ఎపిసోడ్ చేశారు. ఆ సెషన్ లో 23 ఏళ్ల సెలెనా తన హిల్ ఆల్బమ్ లోంచి కొన్ని పాటలు పాడింది. తన జీవితం గురించి, ప్రేమ గురించి కూడా చాలా ముచ్చట్లు చెప్పింది ఆ బుల్లెమ్మ. టేలర్ స్విఫ్ట్ స్క్వాడ్ చాలా సెక్సీగా ఉంటుందని, అందులో సెలెనా గోమెజ్ కూడా ఉంటే మరింత బాగుంటుందని కార్డెన్ కామెంట్ చేశాడట.

అయితే అందులో అందరూ అమ్మాయిలే ఉన్నారు తప్ప అబ్బాయిలను అసలు పిలవడం లేదని బుంగమూతి పెట్టుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో సెలెనా గోమెజ్ కలగజేసుకుని, ముందు తనకో బాయ్ ఫ్రెండ్ ను చూసిపెట్టాలని కోరింది. దాంతో కుర్రాడు ఒక్కసారిగా షాకయ్యాడట. నిజంగా కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నావా అని అడిగితే.. అవును, అందులో తప్పేంటని వాదించిందట. పెళ్లి కొడుకుని చూడమని పూర్వం చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది కదా, ఏకంగా బాయ్ ఫ్రెండ్ కావాలని, చూసిపెట్టాలని కోరుతున్నారు.

English summary

Selena Gomez needs a boyfriend