ట్టిట్టర్‌లో కొట్టుకుంటున్న పాప్ ప్రేమికులు

Selena shocking comments on Justin Bieber

02:19 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Selena shocking comments on Justin Bieber

కలిసి ఉన్నప్పుడు లోపాలు తెలియవు, విడిపోయినప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. సభ్యత మరిచి సైతం తిట్ల దండకం అందుకుంటారు. సరిగ్గా ఇప్పుడు వీరిద్దరూ అదే చేస్తున్నారు. ఇక ఆ తిట్లు ఎలా వున్నాయంటే, ఒకరి జాతకం మరొకరు బయట పెట్టేసుకుంటున్నారు. వారెవరంటే, పాప్ మ్యూజిక్ తో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న పాప్ సింగర్స్ జస్టిన్ బైబర్, సెలెనా జంట... వీరిద్దరూ ఎంతో కాలంగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఈ జంట ట్విట్టర్ వేదికగా వివాదాస్పద కామెంట్స్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఇద్దరు పాము, ముంగిసలా వ్యవహరిస్తున్నారు. వీరి గొడవకు కారణం బైబర్ గర్ల్ ఫ్రెండ్ సోఫియానేనట.

సోఫియాతో బైబర్ చనువుగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో సెలెనా తిట్లరూపంలో కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో సోఫియాతో కలిసి ఉన్న ఫోటోలను బైబర్ పోస్ట్ చేసేవాడు. ఈ ఫోటోలపై అభిమానులు అసభ్యకర కామెంట్స్ చేయడంపై బైబర్ మండిపడ్డాడు. కామెంట్స్ ఆపకపోతే సోషల్ మీడియా నుంచి వైదొలుగుతానని హెచ్చరించాడు. బైబర్ పెట్టిన ఈ పోస్ట్ పై సెలెనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నువ్వు ఫోటోలు పెట్టి అభిమానులపై పడతావెందుకు? కామెంట్స్ భరించలేకపోతే ఫోటోలు పెట్టడం ఆపెయ్ అంటూ అభిమానులకు సెలెనా మద్ధతుగా నిలిచింది. సెలెనా కామెంట్ పై బైబర్ రిప్లై ఇచ్చాడు.

ఒకప్పుడు తన క్రేజ్ ఉపయోగించుకుని పైకొచ్చిన వ్యక్తులే నేడు విమర్శించే స్థాయికి ఎదిగారని... ఇది నిజంగా హాస్యాస్పదమని పరోక్షంగా సెలెనాకు చురకలు అంటించాడు. సెలెనా కూడా ట్వీట్ల యుద్ధాన్ని కొనసాగించింది. బైబర్ తనతో డేటింగ్ చేసి చాలాసార్లు చీట్ చేశాడని పోస్ట్ చేసింది. అయినా తనను క్షమించినందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద ఈ వీరిద్దరి యవ్వారం తారాష్ట్రాయికి చేరింది. ఇంకా ఎన్నాళ్ళో ఈ భాగోతం నడుస్తుందో చూడాలి.

English summary

Selena shocking comments on Justin Bieber