వెరీ డేంజరస్ సేల్ఫీ

Selfie At Shun Hing Tower in Shenzhen

03:56 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Selfie At Shun Hing Tower in Shenzhen

గతంలో ఫోటో తీయించుకోవాలంటే కష్టమేమో గానీ ఇప్పుడు కాదుగా, అలా తీసేసుకుని , ఇలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు. అందుకే సెల్ఫీ అంటే అభిమానులకు మామూలు పిచ్చి కాదు. దీని కోసం యూత్ ఏమైనా చేస్తోంది. సేల్ఫీ వలన ఒక్కోసారి ప్రాణాలు పోయిన ఘటనలు వుంటున్నాయంటే అతి సయోక్తి కాదు . అందుకు లేటెస్ట్ ఎగ్జాంఫుల్ కి తార్కాణం. ఇంతకీ విషయమేమంటే, చైనాలో ఎత్తైన బిల్డింగ్‌పై నిలబడి ముగ్గురు సాహసవీరులు సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకోసం ఆ భవనంపైకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో సగం వరకు లిఫ్ట్‌లో వెళ్లారు. ఆ తర్వాత లిఫ్ట్ లేకపోవడంతో ఎలాంటి సేఫ్టీ లేకుండా బయటినుంచి శిఖరా నికి ఎగబాకారు. రష్యా- ఉక్రెయిన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్లు 21 ఏళ్ల విటలీ రాస్‌క్లావ్‌, 25 ఏళ్ల వదిమ్‌ మకోరావ్‌లు ‘ఆన్‌ ద రూఫ్స్‌’ పేరుతో ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. వీళ్లకి ఇవాన్‌ బీర్కస్‌ అనే మరో వ్యక్తి కూడా తోడయ్యాడు. చైనాలోని షెంజెన్‌ ప్రాంతంలోవున్న షున్‌ హింగ్‌ స్క్వేర్‌ టవర్‌ పైకి ఎక్కి వీరంతా సెల్ఫీ దిగారు. అనుకున్న పని అయ్యాక ఎంచక్కా వచ్చేశారు.

ఇంతకీ సేల్ఫీ తీసుకున్న ప్రాంతం భూమికి దాదాపు 1260 అడుగుల ఎత్తులో వుందట. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల్లో ఇది 28వ ప్లేస్. గతంలో ఈ బృందం ప్రపంచంలోనే రెండో ఎత్తైన షాంఘై భవనం ఎక్కారు. దీని ఎత్తు 2,073 అడుగులు. వీళ్లంతా బిల్డింగ్‌లోకి వెళ్లిన దగ్గర నుంచి అంతా వీడియో తీసి, యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్ చేశారు. 6 రోజల్లో దాదాపు 7 లక్షల హిట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అత్యంత రిస్క్ తో కూడిన ఈ సాహసం చేసారు సరే, ఏదైనా జరగరానిది జరిగితే,.... అసలు అలా వెళ్లడానికి అనుమతి ఎలా పొందారో కూడా తెలీదు ఈ ఘటన సహజంగానే చర్చనీయాంశమైంది. చాలామంది దీన్ని అత్యంత డేంజరస్ సెల్ఫీ అంటున్నారు.

English summary

Three photographers from Russia and Ukraine climbed the top of one of the world’s tallest towers Shun Hing Tower in Shenzhen, bare-handed, to take selfies.