బుంగ మూతి కోసం పెరుగుతున్న ఆపరేషన్లు

Selfie Craze Goes Viral In US

10:41 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Selfie Craze Goes Viral In US

తాము పెట్టే బుంగముతితో మగాళ్ల మనసుల్ని దోచుకునే చాన్స్ ఉందన్న విషయం ఆడాళ్లకు తెలియంది కాదు. బుంగమూతికి మగాళ్లు ఫ్లాట్ కావటమే కాదు.. సెల్ఫీలు క్రేజ్ విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడదో స్టైల్ ఐకాన్ గా మారిపోయింది. ‘‘నేను హర్ట్ అయ్యా’’ అంటూ ఈ మధ్య ఓ సినిమాలో నటి సమంత బుంగమూతి పెడితే.. కుర్రకారు ఎంతగా ఫీల్ అయిపోయారో తెల్సిందే. అలాగే ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో ' నీ బుంగ మూతి అందం..' అంటూ ఓ పాట కూడా అదర గొట్టేసింది.

ఇవి కూడా చదవండి: మందు తాగి అమ్మాయిలు హాస్టల్ లో ఎలా రెచ్చిపోయారో చూడండి

ఇక సున్నా చుట్టినట్లుగా బుంగమూతి పెట్టేసి.. ఎంచక్కా ఓ సెల్ఫీ దిగేస్తే ఆ అందమే వేరని తెగ ఫీలవుతున్న ఆడోళ్ల సంఖ్య అమెరికాలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆడోళ్లే కాదు బుంగమూతి క్రేజ్ అబ్బాయిలకు బాగానే పట్టింది. మరి.. ఉన్నట్లుండి బుంగమూతి కావాలంటే కష్టం కదా? అన్న డౌట్ అక్కర్లేదు. బాడీలో ఏ పార్ట్ అయినా నచ్చినట్లుగా మార్చేసుకునే శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావటంతో అందమైన బుంగమూతికి అవసరమైన పెదాల కూర్పు కోసం ఆపరేషన్లు చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందట. బుంగమూతి కోసం ఆసక్తి చూపే యూత్ ఎక్కువైనట్లుగా గుర్తించారు.

అదెలా అంటే, 2015 సంవత్సరంలో ప్రతి 19 నిమిషాలకు ఒక లిప్ సర్జరీ జరిగినట్లు అమెరికాలో చేపట్టిన తాజా సర్వే లెక్క బయటకొచ్చింది. అమెరికా వ్యాప్తంగా 27449 మంది అపరేషన్లు చేయించుకున్నట్లు తేలింది. సెల్ఫీల్లో ఆకర్షణీయంగా కనిపించేందుకే ఈ బుంగమూతి సర్జరీలు చేయించుకుంటున్నట్లు లెక్క తేల్చారు. మొత్తానికి సర్జరీతో శరీర ఆకృతులను రకరకాలుగా మార్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:5 సంవత్సరాల పాపకి వివాహం చేసిన కసాయి తల్లిదండ్రులు

ఇవి కూడా చదవండి:పోర్న్ చూస్తున్నాడని తాతని చంపేసిన బామ్మ

English summary

In these days so many people were addicted to selfie by putting their lips in Zero shape and recently in a survey in America found that for every 19 minutes one lip surgery was being done in America.