సెల్ఫీస్టిక్ తో సెల్ఫీస్టిక్ కు చెక్

Selfie Stick App For Clicking Selfies

04:53 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Selfie Stick App For Clicking Selfies

ఎవరి సహాయం లేకుండా మనకు మనమే మంచి ఫొటో తీసుకోవాలనుకుంటే ఉపయోగపడే సెల్ఫీ ఫొటో ఇంకా మంచిగా రావాలంటే ఓ సెల్ఫీస్టిక్ ఉంటే బెటర్. కానీ మంచి సెల్ఫీ కోసం ఇకపై సెల్ఫీస్టిక్ అవసరమేలేదు. సెల్ఫీస్టిక్ యాప్ ఉంటే చాలు. అమెరికాకు చెందిన ఫోర్డ్‌ డేవిస్‌ అనే ఐఓఎస్‌ డెవలపర్‌ సెల్ఫీ స్టిక్‌ పేరుతో ఓ యాప్‌ని ఆవిష్కరించాడు. ఈ యాప్‌ సహాయంతో మనం కేవలం తలను కొంచెం పక్కకి వంచితే చాలు.. మనం ఎలాంటి బటన్స్‌ నొక్కకుండానే సెల్ఫీ తీసేసుకోవచ్చు. సెల్ఫీస్టిక్‌ యాప్‌లో ఉండే ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. మనం సెల్ఫీ దిగేటప్పుడు తలను కొద్దిగా వంచగానే.. టైమర్‌ స్టార్ట్‌ అవుతుంది. అప్పుడు అది మన ముఖాన్ని గుర్తిస్తుంది. వెనువెంటనే అందమైన సెల్ఫీ వచ్చేస్తుంది. యాపిల్‌ స్టోర్స్‌ నుంచి ఈ యాప్‌ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే ఉన్న ఈ యాప్ త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

English summary

A New smart phone app named " Selfie Stick " has been released to that allows a user take selfie or groupfie by just tilting his/her head and without a physical selfie stick.