ఛీ! ఇదేం జాకెట్‌ అంటూ నటి అన్నపూర్ణ రాద్ధాంతం...

Senior actor Annapurna in Open Heart with RK

01:08 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Senior actor Annapurna in Open Heart with RK

తెలుగు సినిమాల్లో అమ్మ పాత్రకు ఒదిగిపోయే నటి అన్నపూర్ణ... సీనియర్‌ నటిగా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. పవిటచెంగు నోట్లో కుక్కుకుంటూ ఆమె కంట తడి పెట్టిందంటే ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతాయి. సెంటిమెంట్‌ సన్నివేశాలు రక్తి కట్టాలంటే ఆమె పాత్ర కచ్చితంగా కీలకం. నాలుగున్నర దశాబ్దాలుగా తల్లి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించినా అవేవీ తనను వెతుక్కుంటూ వచ్చిన వేషాలు కావని, వాటిని తానే ఏరి కోరి ఎంచుకున్నానని ‘అన్నపూర్ణ’ చెబుతూ ఉంటుంది. నాటకాల నుంచి సినీ రంగానికి వచ్చిన ఈమె ఇటీవల ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి లో 'ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఓ సినిమాలో జాకెట్ గురించి జరిగిన రాద్ధాంతం వివరించింది. "ఇవివిగారి అప్పుల అప్పారావు సినిమా విజయవాడలో షూటింగ్‌. అందరూ హోటల్‌లో ఉంటే మా ఇల్లు ఆ ఊర్లోనే కాబట్టి ఇంట్లోనే మేకప్‌ వేసుకుని రెడీ అవుతున్నా. ఈలోగా ఒకతను కాస్ట్యూమ్స్‌ పట్టుకొచ్చాడు. వాటిలో ఓ జాకెట్‌ వెనకాలంతా కిటికీ ఊచల్లాంటి డిజైన్‌. ఛీ! ఇదేంటి? ఇంకెవరివో కాస్ట్యూమ్స్‌ పట్టుకొచ్చినట్టున్నాడు అనుకుని తీసుకెళ్లిపోమన్నా. ఈలోగా మా అమ్మేమో అతన్ని వెళ్లకుండా ఆపి నా దగ్గరికొచ్చింది. సినిమాల్లో మనకేమీ బంధువులెవరూ లేరు కదా? ఏదో ఆ కాసేపూ వేసుకుని డైలాగులు చెప్పి వచ్చేయ్‌.

ఈ జాకెట్‌ గురించి సినిమా వద్దన్నావంటే నీకు బాగా బలిసింది, డబ్బులు బాగా సంపాదించి అవకాశం వదులుకుంది అంటారు, కాబట్టి చేయి. ఒకవేళ అదే వేషం క్లిక్‌ అయితే అలాంటి అవకాశాలు కూడా వస్తాయి అని నచ్చజెప్పి జాకెట్‌ వేయించింది" అంటూ అన్నపూర్ణ వివరించింది.


English summary

Senior actor Annapurna in Open Heart with RK. Character artist Annapurna talkied about her old memory.