అతిలోక సుందరితో నరేష్ ప్రేమ వ్యవహారం!

Senior actor Naresh proposed to Sridevi

06:43 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Senior actor Naresh proposed to Sridevi

విజయనిర్మల తనయుడు నరేష్ 'పండంటి కాపురం' చిత్రంతో బాల నటుడిగా పరిచయమై.. ఆ తరువాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుని.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే నరేష్ 45 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో తన జీవితంలో ఎదురైన ఓ థ్రిల్లింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. అతిలోక సుందరి శ్రీదేవికి అప్పట్లో తాను ప్రపోజ్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు. శ్రీదేవి తనకన్నా వయసులో 2 ఏళ్ళు పెద్దదని, చిన్నప్పుడు శ్రీదేవి తమ ఇంటి పక్కనే వుండేదని చెప్పాడు.

అప్పట్లో తామిద్దరం కలిసి ట్యూషన్ కు వెళ్ళేవాళ్ళమని.. ఒక రోజు శ్రీదేవికి తాను ఐ లవ్ యూ చెప్పానని, దానికి శ్రీదేవి మా అమ్మతో చెపుతానని అనడంతో భయపడి ఆ తరువాత శ్రీదేవి వైపు చూడటం మానేసానని గుర్తుకు తెచ్చుకున్నాడు. మళ్ళీ శ్రీదేవి టాప్ హీరోయిన్ అయిన తరువాత తనకు ఎదురు పడినప్పుడు.. శ్రీదేవి తనతో మాట్లాడడమే కాకుండా తాను ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసి తనకు షాక్ ఇచ్చిందని నరేష్ చెప్పారు.

English summary

Senior actor Naresh proposed to Sridevi