బెంగళూరు ఘటన పై బాలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం

Senior Bollywood actors are serious about the Bangalore incidents

10:29 AM ON 5th January, 2017 By Mirchi Vilas

Senior Bollywood actors are serious about the Bangalore incidents

న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా బెంగళూరు మహానగరంలో డిసెంబరు 31న మహిళల పట్ల కొందరు మగాళ్ల అనుచిత వైఖరి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆకతాయిలు మహిళలపట్ల వ్యవహరించిన తీరుకు సర్వత్రా విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ, ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగళూరులో యువత చేసిన వికృత చేష్టలు సిగ్గుపడాల్సిన విషయం. మేమూ ఆ వయసు దాటి వచ్చినవారిమే కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రధాని మోదీ ఈ విషయంపై వెంటనే స్పందించాలి అంటూ ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ , సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ట్వీట్ చేశారు.

బెంగళూరులో చోటుచేసుకున్న ఘటన చాలా బాధాకరం. మన దేశంలో ఇలాంటివి జరిగాయంటే అది మనందరికీ అవమానకరం. ఇలాంటి విషయాల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కాలపు యువత.. ఆడపిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఏమీ జరగదులే అనుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలా తప్పు జరిగిన వెంటనే అరెస్ట్ చేస్తుంటే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ఆడపిల్లలవైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు.

ఆమిర్ తో పాటు ఫర్హాన్ అక్తర్ , రిచా చద్దా, వరుణ్ ధావన్ లు కూడా స్పందిస్తూ, బెంగళూరు ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

ఇది కూడా చదవండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

ఇది కూడా చదవండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

ఇది కూడా చదవండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

Senior bollywood writer Salem khan is serious about the incident in Bangalore.He needs a clarification from Narendra mode.