సెన్‌హెయిజర్ నుంచి మూమెంటమ్ హెడ్‌ఫోన్లు

Sennheiser Launches Momentum Wireless Headphones

06:40 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Sennheiser Launches Momentum Wireless Headphones

జర్మనీకి చెందిన ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ సెన్‌హెయిజర్ సరికొత్త స్మార్ట్ హెడ్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మూమెంటమ్ ఎం2 ఆన్ ఇయర్, ఎం2 ఓవర్ ఇయర్ పేరిట ఈ రెండు హెడ్ సెట్లను రిలీజ్ చేసింది. ఈ హెడ్‌ఫోన్లకు చెందిన వైర్‌లెస్ వేరియెంట్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. మూమెంటమ్ ఎం2 ఆన్ ఇయర్ ధర రూ.15,990. ఇందులో వైర్‌లెస్ వేరియెంట్ ధర రూ.27,990. ఇక ఎం2 ఓవర్ ఇయర్ ధర రూ.24,990. దీని వైర్‌లెస్ వేరియెంట్ ధర రూ.34,990. ఈ హెడ్ ఫోన్లను ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. ఈ హెడ్‌ఫోన్లు వినియోగదారులకు అత్యుత్తమమైన సౌండ్ క్వాలిటీని ఇస్తాయని, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకునే వీటిని డిజైన్ చేశామని పేర్కొంది. వైర్‌లెస్ వేరియెంట్లను బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీల ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చని తెలిపింది.

English summary

Sennheiser company launches a two new wireless headphones named Momentum M2, Momentum Wireless Headphones in India.The new headphones are priced at Rs. 15,990 for the Momentum M2 On-Ear, Rs. 24,990 for the M2 Over-Ear, Rs. 27,990 for the Momentum Wireless On-Ear, and Rs. 34,990 for the Momentum Wireless Over-Ear.