ఐస్ ఉగ్రవాద సంస్థను హిల్లరీ నెలకొల్పిందట

Sensational comments on Hillary Clinton

11:30 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Sensational comments on Hillary Clinton

అవునా, ఎంత మాట.. ఓ అగ్ర రాజ్యానికి అధిపతి కావడానికి పోటీ పడుతున్న మహిళ ఈ పని చేసిందా? పైగా ఆమె భర్త మాజీ ప్రెసిడెంట్ కూడానూ.. అంతేకాదు అమెరికా కూడా ఐస్ దాడులకు గురి అవుతోంది. మరి అలాంటి సంస్థ నెలకొల్పడం వెనుక ఈమె ఉండడం ఏమిటి? కానీ ఇది నిజమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరిగిపోయిన ట్రంప్ తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)ను స్థాపించింది హిల్లరీనేనని ఆరోపించారు.

ఐఎస్ ను స్థాపించినందుకు ఉగ్రవాదులంతా ఆమెకు బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు హిల్లరీది సంకుచిత మనస్తత్వమని కూడా ఈయన ధ్వజమెత్తారు. మొత్తానికి ఈ ఆరోపణలు ఎక్కడిదాకా పోతాయో చూడాలి.

English summary

Sensational comments on Hillary Clinton