'ఇక నుంచి పాడను అంది' అంతే ఈ లెజండరీ సింగర్ ని చంపేశారు!

Sensational news about legendary singer S. Janaki

01:12 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Sensational news about legendary singer S. Janaki

దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టెయ్యమన్నాడట వెనకటికొకడు అనే సామెత ఉండనే వుంది కదా. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా వెనకా ముందు చూసుకోకుండా సోషల్ మీడియాలో ఈ మధ్య ఏవేవో వస్తున్నాయి. అవి పట్టించుకోనవసరం లేదు. కానీ బతికున్నవాళ్లను చంపేయడం మాత్రం దారుణం. గతంలో కూడా ఇలాగే కొంతమంది నటులను సోషల్ మీడియా చంపేస్తే, పాపం వాళ్ళు సీన్ లోకి వచ్చి బతికే ఉన్నామని చెప్పుకున్నారు కూడా. అయినా తీరు మారలేదు. ఇప్పుడు ఈ బాధితుల జాబితాలో ఈసారి లెజెండరీ సింగర్ ఎస్.జానకమ్మ చేరిపోయారు. ఇకపై పాటలు పాడను అని ఆమె ప్రకటిస్తే.. ఏకంగా ఆమె చనిపోయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వందల సంఖ్యలో నెటిజన్లు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ, సంతాప సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న నెటిజన్లు ఇటీవలి కాలంలో చాలామంది సెలబ్రెటీలను ఇలాగే బతికుండగానే చంపేశారు. ప్రస్తుతం మలయాళ సినిమాలో పాడుతున్న పాటే తన చివరి పాటని మాత్రమే జానకి ప్రకటించారు. ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో చూసి, పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక వీరలెవల్లో తిడుతూ, కామెంట్లతో నెటిజన్లు కుళ్ళబొడిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 'మజ్ను' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: సచిన్ ను టీంలో నుండి గెంటేస్తామని చెప్పాం..

ఇది కూడా చదవండి: పవన్, ఎన్టీఆర్ లు నా ముందు బచ్చాగాళ్ళు(వీడియో)

English summary

Sensational news about legendary singer S. Janaki. Social media killed the legendary singer S. Janaki.