అక్కడ డేటింగ్ చేస్తే వేసే శిక్ష తెలిస్తే షాకౌతారు!

Sentenced for dating in this country

01:44 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Sentenced for dating in this country

ప్రస్తుత కాలంలో డేటింగ్ సర్వసాధారణం. ఒకప్పుడు ఈ కల్చర్ విదేశాల్లో మాత్రమే ఉండేది. కానీ అది ఇప్పుడు మన దేశంలోకి కూడా వచ్చేసింది. విదేశాల్లోకంటే మన దేశంలోనే ఇంకా ఎక్కువగా డేటింగ్ చేసుకుంటున్నారు. అయితే ఒక చోట మాత్రం డేటింగ్ చేస్తే పోలీసులు వేసే శిక్ష ఏంటో తెలుసా? ఆ శిక్ష చూస్తే మనం షాక్ అయిపోతాం. డేటింగ్ చేస్తే పోలీసులు ఇంత దారుణమైన శిక్షలు వేస్తారా అని ఆశ్చర్యపోతాం! పవిత్రమైన మశీదు.. ఎదురుగా ఎర్రని తివాచీ పరిచిన వేదిక.. దాని చుట్టూ ఆసక్తిగా చూస్తున్న స్థానికులు.. ముసుగులు వేసుకున్న నలుగురు పోలీసులు వస్తున్నారు..

1/4 Pages

వారి వెంట తెల్లని వస్త్రాలు ధరించిన ఓ అమ్మాయి వస్తోంది. ఆమెను తీసుకు వచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. కళ్లు మూసుకుంది. వెంటనే ఓ పోలీసు కొరడా తీసుకుని ఆమెను కొడుతున్నాడు. ఆ అమ్మాయి మాత్రం కొరడా దెబ్బలు పడుతున్నా తన బాధను ఓర్చుకుంటూ కన్నీళ్లతోనే వెల్లడిస్తోంది. ఇలా మూడు జంటలను పోలీసులు చితక్కొట్టారు. ఇంతకు డేటింగ్ కు ఇంత దారుణమైన శిక్షలు వేస్తోంది ఎక్కడో తెలుసా? ఇండినేషియాలో.. ఆ దేశంలోని బాందా అసేహ్ ప్రావిన్స్ లో షరియా చట్టం అమలు 2001 నుంచి ప్రారంభమైంది. ఈ చట్టంలోకి తాజాగా మద్యపానం, పెళ్ళికి ముందు లైంగిక సంబంధాలు, సజాతి సంపర్కం, జూదం వంటి వాటిని కూడా తీసుకువచ్చారు.

English summary

Sentenced for dating in this country