'సర్దార్‌’ కి సీక్వెల్ ఉంటుంది...

Sequeal for Sardar Gabbar Singh movie

03:15 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Sequeal for Sardar Gabbar Singh movie

ఓవైపు హీరోగా, మరోవైపు జనసేన నేతగా ద్విపాత్రాభినయం సాగిస్తున్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ తాజాగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఇటీవలే రిలీజయింది. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో 'సర్దార్‌’ ఫలితంపై సంతృప్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు 'అందరూ బాగుంది అంటున్నారు. నేనూ హ్యాపీనే. మేం ఎంత కష్టపడాలో అంత పడ్డాం. ఫలితం చెప్పాల్సింది ప్రేక్షకులే' అని బదులిచ్చాడు. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ, 'నూటికి నూరు శాతం ఉంటుంది. దర్శకుడు ఎవరు? ఎప్పుడు? అన్నది చెప్పలేను. ఇక నా తదుపరి చిత్రం ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో ఉంది. ఫ్యాక్షనిజంతో కూడిన ప్రేమకథ అది' అని వివరించాడు.

English summary

Sequeal for Sardar Gabbar Singh movie. Pawan Kalyan said in latest interview that their will be sequeal for Sardar Gabbar Singh movie.