భారతీయుడు కి సీక్వెల్

Sequel for Bharateeyudu

12:43 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Sequel for Bharateeyudu

లోకనాయకుడు కమల్ హాసన్ 1996లో నటించిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు'. మూస సినిమాల చూసి చూసి విసుగు చెందిన ప్రేక్షకులకి రెండు దశాబ్ధాల క్రిందటే తమ టాలెంట్ ఏంటో 'భారతీయుడు' సినిమా ద్వారా చూపించిన ఘనత శంకర్ మరియు కమల్ హాసన్ ది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. కమల్ మేకప్-మర్మకళ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఏ.ఎం రత్నం ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ని నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నాడు. దీని గురించి ఇప్పటికే కమల్ ని సంప్రదించినట్టు సమాచారం.

శంకర్ కూడా సుముఖత తెలుపుతున్నట్టు తెలుస్తుంది. భారతీయుడు క్లైమాక్స్ లో ముసలి కమల్ హాసన్ నా దేశానికి ఎప్పుడు అవసరమైనా నేను వస్తా అనే డైలాగ్ ఈ సీక్వెల్ కి పునాదిగా నిలుస్తుంది. చూద్దాం మరి ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కార్యరూపం దాల్చుతుందో లేదో అని..

English summary

Sequel for Bharateeyudu. Universal Star Kamal Hassan super hit movie Bharateeyudu. Now they are getting to take sequeal for this movie.