మైఖేల్ జాక్సన్ మళ్లీ పుట్టాడు?(వీడియో)

Sergio Cortes The New Michael Jackson

10:51 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Sergio Cortes The New Michael Jackson

పునర్జన్మ ఉంటుందని చెబుతారు. ఇది నమ్మినా నమ్మకపోయినా కొందరికి దీనిపై వుండే విశ్వాసం అపారం. ఇక ప్రేక్షకులను ఉర్రుతలూగించిన పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా, ఆయన మ్యూజిక్ ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. పాప్ మ్యూజిక్ ముఖ స్వరూపాన్నే మార్చేసిన ఈ పాప్ రారాజు... తన జీవితం మొత్తం సంగీత ప్రియుల కోసమే అంకితం చేశారు. అభిమానులు ముద్దుగా ఎంజే అని పిలిచే మైఖేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆయన చనిపోలేదనీ, ఇంకా బతికే ఉన్నాడని కొందరంటే... దయ్యమై తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో కనిపించాడని మరికొందరన్నారు. శిఖరమంత ఎత్తున తనదైన చరిత్ర రాసుకున్న ఎంజేతో పోల్చుకోవడానికి కూడా ఎవరూ సరిపోనప్పటికీ, ఇదిగో తానున్నానంటూ సెర్గియో కార్టెస్ అనే ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చాడు. అచ్చం మైఖేల్ జాక్సన్ లా పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న అతడిని చూసి పాప్ సమాజం నివ్వెరపోతోంది. మైఖేల్ జాక్సన్ ను అనుకరించడం తన అలవాటుగా చెప్పుకునే సెర్గియో ఇన్ స్టాగ్రామ్ లో పలు ఫోటోలను పోస్టు చేశాడు. మైఖేల్ జాక్సన్ మళ్లీ పుట్టాడా అన్నట్టున్న ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కామెంట్స్ కూడా అదిరిపోతున్నాయి. మరి మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి: సన్నీకి బంపరాఫర్ - అయినా పైకి చెప్పడంలేదట

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్ : యూట్యూబ్ లో ధృవ

English summary

Pop King Michael Jackson was died in June 25th in the year 2009 and so many fans of him were gone into deep depression because of MJ's death and now a fan of Michael Jackson was turned as a new MJ and he was dancing and singing same as MJ.