తగ్గనున్న సెట్‌టాప్ బాక్సుల ధరలు

Set-top boxes Price To Be Come Down

04:31 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Set-top boxes Price To Be Come Down

దేశంలో డిజిటైజేషన్‌కు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల(ఎస్‌టీబీ) ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ సీ-డాక్, బెంగళూరుకు చెందిన కంపెనీ బైడిజైన్ కలిసి రూపొందిస్తున్న స్వదేశీ సీఏఎస్(కండీషనల్ యాక్సెస్ సిస్టమ్) టెక్నాలజీని సెట్‌టాప్ బాక్స్ తయారీదారులకు సగం కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఒక్కో సీఏఎస్ లైసెన్సు ధర 2-3 డాలర్లుగా ఉంది. స్వదేశీ సీఏఎస్‌ను 0.5 డాలరుకే (మన కరెన్సీలో రూ.32)ఇవ్వనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. ఫలితంగా కంపెనీలు ఎస్‌టీబీల ధరలను భారీగా తగ్గించేందుకు వీలవుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో సెట్‌టాప్ బాక్స్ రేటు రూ.800-1200 మధ్యలో ఉంది. స్వదేశీ సీఏఎస్ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టుకోసం రూ.29.99 కోట్లు వెచ్చించినట్లు, అందులో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ(డైటీ) రూ.19.79 కోట్లు భరించిందని ఐటీ శాఖ తెలిపింది.

English summary

Set-top boxes (STBs) are likely to become cheaper as an ingenuously-developed solution for conditional access system (CAS) will be made available to domestic manufacturers at less than half the current prices.