సెట్ ఆప్ బాక్సులకు  2 నెలల గడువు 

Setup Box Deadline Extended For Two Months

01:38 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Setup Box Deadline Extended For Two Months

ఎపిలోని పలు పట్టణ, నగర ప్రాంతాల్లో కేబుల్ టివి డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈనెల 31వ తేదీలోగా సెట్ ఆప్ బాక్సులు పెట్టిన్చుకోవాల్సి వుండగా , మరో రెండు నెలలు గడువు పొడిగించారు. ఈమేరకు హైకోర్టు ప్రకటించింది.

కేబుల్ డిజిటలైజేషన్ లో భాగంగా సెట్ ఆప్ బాక్సులు వేయుంచుకోవాలని టెలికం రెగ్యులేటరీ అధారటీ (ట్రాయ్ ) ప్రకటించడంతో సెట్ ఆప్ బాక్సుల ఏర్పాటు ప్రక్రియ సాగుతోంది. అయితే చాలామంది ఇప్పటికీ సెట్ ఆప్ బాక్సుల పట్ల పట్టనట్టుగా వుండడం , మరోపక్క సరిపడా బాక్సులు సకాలంలో అందుబాటులో లేకపోవడం వంటి పరిణామాల నేపధ్యంలో గడువు దగ్గర పడడంతో హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. గడువు 2 నెలలు పొడిగించాలని సూచించింది. దీంతో కొంత ఊరట లభించింది.

English summary