డార్క్‌స్పాట్స్ (నల్లని మచ్చలు) నుండి విముక్తి పొందండి ఇలా!!

Seven simple tips for black spots

05:43 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Seven simple tips for black spots

చంద్రబింబం లాంటి ముఖం మీద నల్లని మచ్చలు ఉంటే బయటకు రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందికి మొటిమల వలన మచ్చలు పడిపోతాయి. వాటిని తగ్గించ్చు కోవడానికి వారు పడే బాధలు అంతా ఇంతా కాదు. చాలా డబ్బులు ఖర్చు పెడతారు. అయినా ఫలితం కనిపించక పోతే ఎంత బాధగా ఉంటుందో కదా.. ! అలాంటి వారి కోసం ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించి మచ్చలు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

ఇంట్లో వాడే అనేక రకాల ఆహార పదార్ధాలతో ముఖం మీది మచ్చలు నయం చేసుకోవచ్చు. అవి వాడడం వలన ఎటువంటి దుష్ప్రబావాలు సంభవించవు. సహజ సిద్దమైన ఆయిల్ ని కొనసాగిస్తూ చర్మాన్ని కాంతివంతం గా మారుస్తాయి.

రాత్రుళ్ళు సరిగా పడుకోకపోవడం, కంప్యూటర్ తో ఎక్కువ సమయం గడపడం వలన, వత్తిడి కి గురి కావడం వలన కంటి కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. మొటిమలపై గోరు తగలడం , మొటిమలను గిల్లడం వలన నల్లని మచ్చలు ఏర్పడతాయి. కొంతమందికి బాగా ఎక్కువగా ఈ సమస్య ఉండడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే వారి కోసం కొన్ని చిట్కాలు:

నిమ్మరసం:

అయ్యో ఈ చిట్కా మనం పాటించలేమే అనే బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది సులభం గా అందరికీ లబించేదే. మార్కెట్ లో ఎక్కడ చూసినా మనకు అందుబాటులో ఉంటాయి. ఇందులో సి విటమిన్ ఉంటుంది. నిమ్మరసం నల్లని మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతి వంతం గా మారుస్తుంది.

  • ఒక తాజా నిమ్మకాయ ను తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి నిమ్మరసాన్ని ఒక గిన్నె లోకి పిండాలి.
  • కొంత దూది ముక్కని తీసుకొని ఆ నిమ్మకాయ రసం లో ముంచి మచ్చలు కలిగిన చోట రాసుకోవాలి.
  • అది ఆరిపోయేంత వరకు ఉంచి ఆరిన తరువాత నీటి తో శుబ్రపరచాలి.
  • ఈ విదం గా 2 వారాల పాటు చేయడం వలన మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారు.

మీది సున్నితమైన చర్మం ఐతే నిమ్మ రసాన్ని డైరెక్ట్ గా రాసుకోవడం వలన మంట వస్తుంది. కాబట్టి ఆ నిమ్మరసాన్ని నీటిలో, రోజ్ వాటర్లో లేదా తేనెలో కలిపి రాసుకోవాలి. వీటిని కూడా పైన చెప్పిన విధముగా రాసుకోవాలి.

మజ్జిగ

మజ్జిగ తాగడం వలన శరీరం చల్లపడుతుంది. ఇది ఆరోగ్య పరం గానే కాకుండా సౌందర్య సాధనాలలో కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది. ఇది నల్లని మచ్చలను మాయం చేయడం లో నిమ్మరసం మాదిరిగానే పని చేస్తుంది. పైగా ఇది ఎటువంటి మంట లేకుండా నల్ల మచ్చలను మాయం చేస్తుంది.

  • మజ్జిగ 4 టీ స్పూన్ లను తీసుకోవాలి.
  • అందులో 2 టీ స్పూన్ ల టమాట రసాన్ని కలపాలి.
  • ఈ రెండిటిని బాగా కలిసే విధం గా కలపాలి. ఇప్పుడు బ్లీచింగ్ గుణాలు కలిగిన ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాసుకోవాలి.
  • 15 నిమిషాలు గడిచిన తరువాత నీటి తో శుబ్రపరుచుకోవాలి.

పాలు

ఒక వేళ మజ్జిగ అందుబాటు లో లేనట్లైతే ఈ చిట్కాని పాటించవచ్చు. పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది క్రమం గా పిగ్మెంటేషన్ ని తగ్గించేందుకు సహాయ పడుతుంది. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. దీని వల్ల మచ్చలు మటు మాయమవుతాయి.

  • కొంచం పాలు తీసుకొని దాంట్లో దూది ని ముంచి ముఖానికి అద్దుకోవాలి.
  • ఇలా 10 నిమిషాలు గడిచిన తరువాత నీటి తో శుబ్రపరుచుకోవాలి.
  • ఈ విధానాన్ని రోజు కి రెండు సార్లు చొప్పున 4 వారాల పాటు చేయాలి.
  • పాలు మరియు తేనె ని కలిపి కూడా వాడవచ్చు. దీనిని కూడా పైన చెప్పిన విదం గా 10 నిమిషాలు ఆరనిచ్చి తరువాత కడగాలి. వీటి వల్ల మంచి ఫలితం దొరుకుతుంది.

ఓట్స్

ఓట్స్ చర్మం యొక్క మృతకణాలను తొలగించడం లో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఒటామీల్ మాస్క్ వేసుకోవడం వలన మృతకణాలను ఇంకా నల్లని మచ్చలను పోగొట్టవచ్చు.

  • ఒక కప్పు ఓట్స్ ని మెత్తగా చేసుకోవాలి.
  • దాంట్లో 3 లేదా 4 టీ స్పూన్ నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
  • ముఖాన్ని ఆ మిశ్రమం తో రద్ధుకొని తరువాత ముఖాన్నిగోరు వెచ్చని నీటి తో కడగాలి.
  • ఈ మాస్క్ ని వారానికి రెండు వేసుకోవడం వల్ల మృతకణాలు తొలిగి చర్మం కాంతివంతం గా మారుతుంది.

బాదం పప్పు

బాదం పప్పు వల్ల శరీరం మంచి రంగు వస్తుంది . దీన్ని రోజూ తినడం వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అలాగే సౌందర్య సాధనాలలో కూడా చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తుంది.

  • 8 లేదా 10 బాదం పప్పులను తీసుకొని రాత్రంతా పాలలో నానబెట్టాలి.
  • మరుసటి రోజు ఉదయం బాదం పప్పుల తొక్కను తీసి బాగా మెత్తగా చేసుకోవాలి.
  • ఇప్పుడు దీంట్లో గంధపు పొడి మరియు సగం టీ స్పూన్ తేనె కలపాలి.
  • వీటన్నిటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.
  • వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
  • 30 నిమిషాల అనంతరం ముఖాన్ని శుబ్రపరుచుకోవాలి.

గంధంపొడి

అద్బుతమైన సౌందర్య సాధనాలలో గంధం ఒకటి. ఇది పాత రోజుల్లో ఎక్కువ గా వాడేవారు. ఇది మచ్చలను తగ్గించడం లో సహాయపడుతుంది.

  • గంధంపొడి, గ్లీసరిన్, రోజ్ వాటర్ ని ఉపయోగించి పేస్ట్ మాదిరిగా చేయాలి. ( రోజ్ వాటర్ అందుబాటు లో లేకపోతే దానికి బదులుగా పాలు లేదా తేనె ని కలపాలి )
  • ఈ మిశ్రమాన్ని ఎఫెక్ట్ కలిగిన చోట రాయాలి.
  • కొన్ని నిమిషాలు గడిచిన తరువాత గోరు వెచ్చని నీటి తో కడగాలి.
  • ఇలా రోజుకి ఒక సారి చేయడం వలన నల్ల మచ్చలు మాయమవుతాయి.

బంగాళదుంప

ఇది కళ్ల కింద నల్లని వలయాలను, మచ్చలను తగ్గించడం లో చక్కగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతి వంతం గా చేస్తుంది.

  • బంగాళ దుంపను ముక్కలుగా కోసి నల్లని మచ్చలు కలిగిన చోట ఉంచాలి. అలా కొన్ని నిమిషాలు గడిచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.
  • అదే విదంగా బంగాళ దుంప మరియు తేనె ని ఉపయోగించి ముఖానికి మాస్క్ వేసుకోవచ్చు.

చూశారు కదా సులభమైన రీతిలో నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.

English summary

Seven simple tips for black spots. Spots and patches on the face can be embarrassing and even lead to low self-esteem.