పొడిచర్మం నుండి విముక్తి పొందండిలా !!

Seven tips for Dry skin

05:29 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Seven tips for Dry skin

పొడిచర్మం కలిగిన వారికి తొందరగా చర్మం పగులుతుంది, దెబ్బతగిలినా తొందరగా మానదు. వీరు తరుచూ మాయిశ్చరైజర్‌ ని వాడుతూ ఉండాలి. అసలే పొడిచర్మం, ఆ పైన చలికాలం ఇక చప్పనక్కర్లేదు వారు పడే బాధలని. అలాంటి వారి కోసం ఏడు రకాల చిట్కాలు అందిస్తున్నాం. వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడవచ్చు.పొడిబారిన చర్మం వలన ముఖంలో జీవం ఉండదు దాని వల్ల మీరు ఎంత తయారయినా సరే కళగా ఉండరు. జీవం కోల్పోన వారిలా ఉంటారు. అందు వల్ల పొడిబారిన చర్మం నుండి విముక్తి లభించాలంటే ఈ క్రింది పద్ధతులను పాటించండి.

ఐస్‌ ముక్కలు

పొడి బారిన చర్మం వలన తరచూ దురదలు వస్తుంటాయి. దాన్ని తగ్గించుకునే మార్గంలో చర్మాన్ని గోకడం వలన చర్మం చిట్లిపోయినట్లు అయిపోతుంది. ఉదాహరణకి బాగా ఎండలకి ఎండిన నేలను ఎప్పుడైనా చూసారా? మన చర్మం కూడా అలాగే బీటలు పడిపోతుంది. ఇలా దురదలుగా ఉన్నప్పుడు దానిని తగ్గించుకోవాలంటే ఒక మంచి పద్ధతి ఉంది. ఐస్‌ ముక్కలు వాడడం వలన చర్మం దురదలు రాదు.

ఉపయోగించే విధానం:

ఫ్రిజ్‌ లో నుండి ఒక ఐస్‌ ముక్కని తీసుకొని ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి దురద గా ఉన్నచోట ఈ వస్త్రంతో అద్దాలి ఇలా చేయడం వలన దురద నుండి ఉపసమనం లభిస్తుంది.

వెన్న

వెన్న లో విటమిన్‌ ఎ మరియు బి తో పాటు ఫ్యాటీఆసిడ్స్‌ ఉండడం వలన చర్మానికి కావలసిన తేమను అందించి పొడి చర్మాన్ని నయం చేస్తుంది. వెన్నను చర్మానికి రాసుకోవడం వలన పగిలిన చర్మాన్ని నయం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

ఓట్స్‌

ఓట్స్‌ ఆరోగ్యపరంగా చాలా మంచి ఆహారం. దీన్ని రోజూ వాడడం వలన అధిక బరువు ను తగ్గించుకోవచ్చు. దీన్ని ఆహారంగానే కాకుండా సౌందర్య సాదనాలలో కూడా వాడుతారు. ఓట్స్‌ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కమిలి పోయిన చర్మాన్ని, వాపుని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఇది తామర వంటి చర్మవ్యాదులను తగ్గిస్తుంది.

ఉపయోగించే విధానం:

  • రెండు కప్పుల ఓట్స్‌ని సగం కప్పు నీళ్ళలో కలిపి బాగా మెత్తగా కలపాలి. వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి, శరీరం అంతా రాసుకోవాలి. అలా రాసుకుని 15 నిమిషాల పాటు వదిలేయాలి.

ఇలా చేయడం వలన అందమైన ముఖ చాయ మీదవుతుంది.

బార్లీ

పొడి చర్మం కలిగిన వారి ముఖాన్ని బాగా గమనించినట్లయితే తెల్లగా పొట్లు పొట్లు గా చర్మం ఊడిపోతుంది. దీనివల్ల ముఖం అసహ్యంగా కనిపిస్తుంది. పొడి బారిన చర్మం నుండి తప్పించుకునేందుకు బార్లీ మంచి ఔషదంలా పనిచేస్తుంది. బార్లీ ఆహారపరంగానూ సౌందర్య సాధనగానూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది పొడిచర్మానికే కాకుండా సున్నితమైన చర్మంగల వారు కూడా ఈ ప్రక్రియని అనుసరించవచ్చు.

ఉపయోగించే పద్ధతి:

  • ముందుగా కొంచెం పసుపు, గంధం పొడిని తీసుకోవాలి. కొద్ధిగా పాలల్లో ఈ రెండిటితో పాటు బార్లీ పొడిని కూడా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరం అంతా రాసుకోవాలి ఇలా చేయడం వలన శరీరం పై పడిన గీతలు మాయమైపోతాయి.

వైట్‌ వెనిగర్‌

వైట్‌ వెనిగర్‌ కాలి పగుళ్ళను మటుమాయం చేస్తుంది. దీనిలో ఎసిటిక్‌ ఆసిడ్‌ వుండడం తో గాయాలను తొందరగా మానిపోయేలా చేస్తుంది. చాలా మంది చర్మ నిపుణులు వెనిగర్ ని సిఫార్స్ చేస్తున్నారు. కాళ్ళ పగుళ్ల ను తగ్గించడం లో ఇది మంచి ఫలితాలను ఇస్తుందని చర్మ నిపుణులు తెలిపారు. వెనిగర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది.

ఉపయోగించే విదానం:

  • ముందు గా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ ని 2 టేబుల్ స్పూన్ మంచి నీటి లో కలపాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని ఆ మిశ్రమం లో ముంచి దెబ్బతిన్న చర్మం పై 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి.
  • ఇలా రోజుకి 3 సార్లు చేయడం వలన మంచి ఫలితం లబిస్తుంది. ఈ పని పూర్తి చేసిన వెంటనే కాలికి సంబందించిన క్రీమ్ ని రాసుకోవాలి.
  • ఇలా చేయడం ద్వారా కాలి పగుళ్లు తగ్గిపోయి అందమైన పాదాలు మీ సొంతం అవుతాయి.

ఆలొవీరా

ఆలొవీరా గురించి అందరికీ తెలుసు. దీనిని చాలా మంది తింటారు జూస్ లు కూడా తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఔషద గుణాలు దీనిలో ఉన్నాయి. ఆలొవీరా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఆలొవీరా జెల్ లో 96 శాతం నీటిని కలిగి ఉంటుంది. అందువల్ల శరీరానికి కావలసిన నీటి ని అందిస్తుంది. దాంతో చర్మం పొడిబారదు ఇంకా చర్మం యొక్క ఇరిటేషన్ ని తగ్గిస్తుంది.

ఉపయోగించే విదానం:

  • తాజా ఆలొవీరా ఆకుని తీసుకొని దాని నుండి ద్రవాన్ని బయటకు తీయాలి. అలా తీసిన ద్రవాన్ని మంచి నీటి లో కలపాలి.
  • తరువాత చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

అల్లం

అల్లం ఒక ఔషదవాహిని. అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు వంటలలో మంచి పరిమళాన్ని, రుచిని ఇస్తుంది. సౌందర్య సాధనాలలో ప్రముఖ పాత్రవహిస్తుంది. వీరు ఎన్ని స్రయత్నాలు చేసినా సరే చర్మం పొడిబారి పోతుందా అయితే ఇది ప్రయత్నించి చూడండి అంటున్నారు చర్మనిపుణులు అల్లం రక్త ప్రసరణ ని మెరుగుపరుస్తుంది.

ఉపయోగించేవిధానం:

  • స్నానం చేసే ముందు 2-3 టేబుల్‌ స్పూన్‌ అల్లం పొడిని 15-20 నిమిషాలపాటు నానబెట్టాలి. ఒకవేళ మీరు బకెట్‌ ని కనుక స్నాసానికి వాడుతున్నట్లయితే ఆ బకెట్‌ నీటిలో ఒకటి లేదా 2 టీ స్పూన్‌ల అల్లం పొడిని జోడించాలి. ( కాని ముఖం మాత్రం ఎట్టి పరిస్థితిలోను కడగ కూడదు ).
  • ముందుగా స్నానం చేసే ముందు కొంచెం నీళ్ళతో మీ చర్మాన్ని పరిక్షించిన తరువాత స్నానం చేయండి. మీకు బాగుంది ఏమీ ఇరిటేషన్‌, మంట మొదలగునవి లేవనుకుంటేనే ఈ పద్ధతిని వాడాలి, లేకపోతే వాడకూడదు.

హెచ్చరిక:

అల్లం పొడితో స్నానం చేసే ముందు పరీక్షించి ఆ పద్ధతిని వాడండి. సాద్యమైనంత వరకు వాడకుండా ఉండడమే మంచిది. ముఖాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ కడగరాదు. దెబ్బ తిన్న చర్మం, పగుళ్లు, ఇరిటేషన్, కమిలిన చర్మం, మొదలగు చర్మ సంబంధ వ్యాధుల తో బాధ పడే వారు ఈ పద్దతిని పాటించరాదు.

English summary

Seven tips for Dry skin. Dry skin often comes with mild inflammation and itches. Follow 7 tips to avoid dry skin problems.