ఏడేళ్ళ బాలిక పై అత్యాచారం 

Seven Year Girl Raped In Delhi

11:45 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Seven Year Girl Raped In Delhi

దేశంలో రోజురోజుకూ మహిళలు, మైనర్‌ బాలికల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మొన్న ఢిల్లీలో 14 ఏళ్ళ బాలికను కిడ్నాప్‌ చేసి ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే ఢిల్లీలో అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని టిగ్రి ప్రాంతంలో 7 ఏళ్ళ వయసున్న బాలిక తన ఇంటి సమీపంలో ఉన్న పార్కులో ఆడుకుంటుండగా ఆమెను 16 ఏళ్ళ బాలుడు ఒక ఖాళీ ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అతడితో సహా ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో ఆ మైనర్‌ బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ బాలికను గమనించిన చుట్టుప్రక్కల వారు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను హుటాహుటాన ఎయిమ్స్‌కు తరలించి బాలికకు శస్త్రచికిత్స అందించారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు,బాలికను పార్కు నుండి ఎత్తుకెళ్ళిన వ్యక్తి బాలిక ఇంటి సమీపం లో వాడని పోలీసులు తెలిపారు. నిందితులను అందరిని కోర్టులో ప్రవేశపెట్టినట్టు పోలీసులు తెలిపారు. వారందరి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

English summary

A seven year old minor girl was raped by three members while she was playing in the park near to her. Police arrested those three people and filed cases on them