ఆటో, రియల్ రంగాల్లో ఇక దూకుడు

Seventh Pay Comission's Rs 1 lakh crore bonanza to boost car, home sales

06:03 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Seventh Pay Comission's Rs 1 lakh crore bonanza to boost car, home sales

ఏడవ వేతన సంఘం వారు ఇచ్చిన నివేదికతో దేశీయ ఆర్ధిక వ్యవస్థ కుదుటపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సంజీవ్‌ ప్రసాద్‌,కోటక్‌ ఇస్టిట్యూషన్‌ల్‌ ఈక్విటీస్‌ వారు మాట్లాడుతూ 7 వ వేతన సంఘం వారు తీసుకున్న చర్యతో ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్ రంగం వారు అధికంగా లాభపడుతారని భావిస్తున్నట్లు తెలిపారు. కొటక్‌ ఈక్విటిస్‌ వారి నివేదిక ప్రకారం భారత ఆర్ధిక రంగానికి 1 లక్షకోట్ల అదనపు ఆదాయం పొందనుంది.

7వ వేతన సంఘం వారు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదలకు ప్రతిపాదించిన కారణంగా 10 మిలియన్ల మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. జీతాల పెంపు వల్ల 2016-2017 సంవత్సరానికి భారత ప్రభుత్వం పై అధనంగా 74,000 వేలకోట్లు భారం పడనుంది. 28,000 వేల కోట్ల వ్యయాన్ని ఒక భారతీయ రైల్వే సంస్థకు ఖర్చుపెట్టనున్నట్లు తెలిపారు.
ఎదేమైనా జీతభత్యాలు పెంపు భారత ప్రభుత్వానికి భారంగా మారాయనే చెప్పాలి . ఈ అదనపు వ్యయం వల్ల భారత ఆర్ధిక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపనుంది.

English summary

The implementation of the seventh Pay Commission report will boost consumption-driven recovery in the domestic economy.