జమ్మూ కాశ్మీర్‌లో వారం రోజులుగా కుంభ వర్షం

Severe floods in Jammu and Kashmir

03:57 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Severe floods in Jammu and Kashmir

జమ్మూ కాశ్మీర్‌లో వారం రోజులుగా కుంభ వర్షం.
జమ్మూ కాశ్మీర్‌లో గత వారం రోజులుగా భారీ కుంభ వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి అక్కడ కొండ చరియలు, నది పైన ఉన్న వంతెనలు కూలిపోతున్నాయి. ఆ పరిస్థితికి అక్కడున్న ప్రజలు వాళ్ళ ఇల్లు పైకి ఎక్కి కాపాడమని ఆర్తనాథాలు పెడుతున్నారు. అక్కడ అధికారులు సమాచారం ప్రకారం 150కి పైగా చనిపోయిఉంటారని తెలియజేశారు. అక్కడి ప్రభుత్వం ఆ వరదల్లో నష్టపోయిన వారికి ఆర్ధిక సాయంగా 1000కోట్లు ప్రకటించింది. అక్కడ సహాయక బృంధాలు 12 వేలకు పైగా ప్రజలని ఆ ప్రమాదాల నుండి రక్షించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న శ్రీనగర్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ప్రమాదంగా మారిన ప్రాంతాలని హెలికాప్టర్లో నుండి చూసి తెలుసుకున్నారు. ఆ వర్షం ఉధృతికి అక్కడ జీలం నది పొంగి పోరలుతూ శ్రీనగర్ని ఆ ప్రవాహంలో ముంచెత్తింది.

శ్రీనగర్‌లో కొన్ని ప్రాంతాలు అయిన సెక్రటేరియట్, హైకోర్టు మరియు ఇతర పరిసర ప్రాంతాలు ఎనిమిది అడుగులకు నీటి ఉధృతి చేరుకుంది. అక్కడ పరిస్థితికి విధ్యుత్ మరియు టెలికమ్యూనికేషన్స్ సంబంధమైన సరఫరాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ఉధృతికి కొండ భాగాలు విరిగి పడటంతో అక్కడ జాతీయ రహదారులు మూసివేశారు. ఆ వరద ఉధృతికి 350 గ్రామాలు నీట మునిగిపోయాయి, మరియు 2325 గ్రామాలకి తీవ్ర నష్టం వాటిల్లింది. వరద పరిస్థితిలను చూడటానికి వచ్చిన అక్కడ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరియు ప్రధాని నరేంద్ర మోడీ సహాయ చర్యలను ఇంకా అధికం చెయ్యమని సూచించారు. నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని తక్షణ సాయంగా 1000 కోట్లు ప్రకటిస్తున్నామని అవసరమయితే ఇంకా సాయం అందిస్తామని, మరియు ఇతర అవసరాలకు ఐదు కోట్లు మరియు 5 వేల గుడారాలు తక్షణ సాయంగా ప్రకటించారు. అక్కడ వరద భాదితులను కాపాడటానికి 130 ఆర్మీ బృందాలు, 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడ భాదితులను సురక్ష చోటుకి తరలించేందుకు 22 IAF హెలికాప్టర్లను, 4 ఎయిర్ క్రాఫ్ట్లను, 23 ఆర్మీ విమానాలను ఉపయోగిస్తున్నాయి.

English summary

Severe floods in Jammu and Kashmir, their is severe raining in jammu and kashmir, due to this lack of people are getting homeless