‘సర్దార్’పై వేధింపుల కేసు

Sexual Harassment Case On Indian Hockey Team Captain

09:27 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Sexual Harassment Case On Indian Hockey Team Captain

భారత హాకీ జట్టు కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌పై వేధింపుల కేసు నమోదైంది. సర్దార్ తనను మానసికంగా హింసిస్తున్నాడంటూ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తాజాగా పంజాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాబ్‌కు చెందిన సర్దార్‌ సింగ్‌కు 2012లో సోషల్‌ మీడియా ద్వారా బ్రిటన్‌కు చెందిన ఓ మహిళతో పరిచయమైంది. 2014లో వారికి నిశ్చితార్థం జరిగింది. కొంతకాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన సర్దార్‌ ఆమెను అబార్షన్‌ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించిన ఆమెను మానసికంగా హింసించడం ప్రారంభించాడు. దీంతో సదరు మహిళ లూథియానా పోలీస్‌ కమిషనర్‌ పీఎస్‌. ఉమ్రాగల్‌ను కలిసి సర్దార్‌పై ఫిర్యాదు చేసింది. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఆమెను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కూమ్‌ కలాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సర్దార్‌పై కేసు నమోదు చేశామని స్టేషన్‌ అధికారి ఎస్‌.ఎస్‌. నగ్రా ధ్రువీకరించారు.

English summary

India hockey captain Sardar Singh has been accused of sexual harassment by his fiancee. A British woman, who got engaged to Sardar in 2012, filed a written complaint with Ludhiana police on Tuesday. Police though have verified the complaint, but an FIR is yet to be registered