షబ్బీర్ కి బెదిరింపుల కలకలం 

Shabbir Ali recieves a warning phone call

05:30 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Shabbir Ali recieves a warning phone call

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీకి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న వార్తలతో తెలంగాణాలో కలకలం రేగుతోంది. పార్టీలకు అతీతంగా షబ్బీర్ కి పరామర్శ లు వెల్లువెత్తాయి. షబ్బీర్ ని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడం,మాజీ మంత్రి గీతా రెడ్డికి అడుగడుగునా అడ్డుతగలడం వంటి చర్యల ద్వారా టి ఆర్ ఎస్ కాంగ్రెస్ ని బెదిరించాలని చూస్తోందని టి కాంగ్రెస్ నేత ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు.

'నేను కాంగ్రెస్ వాడిని . ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎత్తి చూపుతూనే ఉంటా. బెదిరింపులకు భయపడేది లేదు ' అని షబ్బీర్ ప్రకటించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వ ధోరణి సరిగా లేదని విమర్శించారు.

ఎఐసిసి దాకా షబ్బీర్ వ్యవహారం వెళ్ళింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ అంశంపై స్పందిస్తూ , షబ్బీర్ కి వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలని కేంద్ర హొమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కి లేఖ రాసారు.

ఇక బిజెపి నేత లక్ష్మణ్ కూడా షబ్బీర్ ని కల్సి సంఘీభావం తెల్పారు. బెదిరింపు వ్యవహారం పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ వ్యవహారం పై మంత్రి కె టి ఆర్ స్పందిస్తూ ఎవరినీ బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. విచారణ జరిపి నిజం నిగ్గు తేల్చాలన్నారు.
అందరూ మాట్లాడేసారు సరే , ఇంతకీ బెదిరించిదెవరు?

English summary

Congress party leader Shabbir ali recieves a warning phone