రెండు డిజాస్టర్లు.. ఓ ఐరన్‌లెగ్

Shah Rukh Khan Behind Two Disaster Movies

11:57 AM ON 26th May, 2016 By Mirchi Vilas

Shah Rukh Khan Behind Two Disaster Movies

సెంటిమెంట్లు అందరికీ వుంటాయి. సినిమా వాళ్ళకైతే ఇక చెప్పక్కర్లేదు. ఫీల్డ్ లో కొంతమందిని ఐరెన్ లెగ్ అంటూ వుంటారట. అయితే ఇప్పడు ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం అంతకు ముందు చెర్రీ బ్రూస్ లీ ఇలా స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్ వెనుక కారణాలు హార్డ్ కోర్ఫ్యాన్స్ వెతుకుతుంటే ఓ కారణం కనిపించిందట . మూవీల షూట్ ప్రారంభం దగ్గర నుంచి పూర్తయ్యే వరకు సెట్స్ కుఏ హీరో వెళ్లాడు? ఐరన్‌లెగ్ ఎవరిది? అనే కోణంలో ఆరాతీయడంతో చివరకు షారుఖ్ ఖాన్ అని కొంతమంది ఫ్యాన్స్ పసిగట్టారట.

అదెలా అంటే, చెర్రీ బ్రూస్ లీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నప్పుడు షారుఖ్ దిల్వాలే కూడా చిత్రీకరణ జరుగుతోంది. దీంతో పక్కనే బ్రూస్ లీ సెట్స్ కి షారుఖ్ వెళ్లాడు. ఈ తతంగం జరిగి రెండు నెలల తర్వాత ప్రిన్స్ బ్రహ్మోత్సవం మళ్ళీ ఫిల్మ్ సిటీ లో ప్రారంభోత్సవం జరిగింది. అక్కడేవున్న షారుఖ్ కూడా ఆ సెట్లో కాసేపు కనిపించాడు. ఆ పిక్చర్స్ అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

ఈ రెండు సినిమాల సెట్స్ దగ్గరకూ వెళ్ళింది షారుఖ్ అని తేల్చేసారు. చెర్రీ, ప్రిన్స్ మూవీలు రిలీజై బాక్సాఫీసు వద్ద భారీగా డిజాస్టర్ కావడంతో షారుఖ్దిఐరన్ లెగ్గే అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వాదనను ఇటు మెగా, అటు సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ లోని మరో వర్గం తోసిపుచ్చుతోంది. స్టోరీలో దమ్మువుండాలేగానీ ఎప్పుడు, ఎక్కడైనా ఆడుతుందని.. హీరోలు సెట్స్ కి వచ్చినంత మాత్రాన వాళ్లది ఐరన్‌లెగ్ అని కామెంట్స్ చేయడం మంచిదికాదని అంటున్నారు. ఏదైతేనేం ఈ సినిమాలూ బాక్సాఫీసు వద్ద భారీ నష్టాలను చవిచూసాయి.

ఇవి కూడా చదవండి: సమంతకు కాబోయే అత్త-మామలు వార్నింగ్

ఇవి కూడా చదవండి:ప్రియురాలి కోసం బాహుబలిలో ప్రభాస్ లాగ సాహసం చేసిన ప్రేమికుడు

English summary

When Shah Rukh Khan's Dilwale movie shooting was going in Ramoji Film city Shah Rukh Khan visited Ram Charan's Bruce Lee Movie Set and Mahesh Babu's Brahmotsavam Movie Sets and now these two films were flop at the box office and now fans were saying that Shah Rukh Khan's leg was iron leg.