బాద్ షా చెంప ఛెళ్లుమనిపించిందెవరు?

Shah Rukh Khan Says That He was Slapped By A Girl

10:46 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

Shah Rukh Khan Says That He was Slapped By A Girl

నిజమండీ బాబూ, సినిమాల్లో హీరో అయితే అవ్వచ్చేమో గానీ నిజ జీవితంలో మాత్రం కాదుగా ... అందుకే ఈ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ని ఓ యువతి చెంప ఛెళ్లుమనిపించింది. అంత పెద్ద నటుడి పై చేయిచేసుకునే దమ్ము ఎవరికుందనుకుంటున్నారా? ఎందుకుండదూ అనిపించక మానదు ఈ ఘటన తో ... ఇంతకీ ఇది జరిగింది ఎప్పుడంటే, షారుక్‌ సినిమాల్లోకి రాకముందు.....ఫ్యాన్‌ ట్రైలర్‌ విడుదలైన సందర్భంగా షారుక్‌ అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను పంచుకున్నాడు.

‘మీరు మొదటిసారి ముంబయికి వచ్చేటప్పుడు రైల్లో వచ్చారా.. విమానంలో వచ్చారా’ అని ఓ అభిమాని షారుక్‌ని అడిగితే, ‘నేను ట్రెయిన్‌లోనే వచ్చాను. ఓ యువతి చేత చెంప దెబ్బకొట్టించుకున్నా కూడా' అని బదులిచ్చాడు . 'నేనెక్కిన ట్రెయిన్‌ ముంబయికి రాగానే లోకల్‌ ట్రెయిన్‌ అవుతుందన్న విషయం తెలీక అలాగే కూర్చుండిపోయా. అప్పుడు కొందరు ప్రయాణికులు నా బెర్త్‌మీద కూర్చోబోతే... టిక్కెట్‌ ఇచ్చి కొన్నాను కూర్చోనివ్వనని చెప్పాను. ఇంతలో ఓ యువతి వచ్చింది... ఆమెకైతే సీటిస్తాను కానీ మగవారిని కూర్చోనివ్వనన్నాను. అంతే ఆ మాట అన్నందుకు ఆమె నా చెంప పగలగొట్టి ఈ సీటు నీ ఒక్కడిది కాదు అందరిదీ అని చెప్పింది...’ అంటూ బాద్ షా వివరించే సరికి అక్కడున్న వారంతా ఖంగు తిన్నారట. భలే వుంది కదా ...

షారుఖ్ ఖాన్ "ఫ్యాన్" చిత్రం గురించి మరిన్ని విశేషాలు...

1/8 Pages

పాత్ర


ఫ్యాన్ చిత్రంలో షారుక్‌ ద్వీపాత్రాభినయం చేసాడు . ఒకటి సూపర్‌ స్టార్‌ ఆర్యన్‌ ఖన్నా అయితే రెండో పాత్ర ఆయన అభిమాని గౌరవ్‌. గౌరవ్‌ పాత్రలో షారుఖ్ 20 ఏళ్ల కుర్రాడిలాగా కనిపించడం విశేషం.

English summary